Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగేళ్ల క్రితం ఇదే మైదానంలో సెంచరీ చేశా (వీడియో)

Ahead of Third Test, Cheteshwar Pujara Recalls his Wanderers Memory

హైదరాబాద్: వాండరర్స్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా మొదలైన దక్షిణాఫ్రికా భారత్‌ల మూడో టెస్టుకు క్రీడాకారులతో పాటు, క్రికెట్ అభిమానులు సైతం మ్యాచ్ గురించి సందిగ్ధంలో ఉంటే పూజారా మాత్రం తన పాత అనుభవాలను ఈ విధంగా పంచుకుంటున్నాడు.

నాలుగేళ్ల క్రితం..:
నాలుగేళ్ల ముందు అంటే 2013 డిసెంబరులో.. అప్పుడు టీమిండియాకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహనెస్‌బర్గ్‌లో తొలి టెస్టు ఆడింది. మళ్లీ ఇప్పడు ఇదే మైదానంలో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది.

Pujara achieves rare feat in opening Test vs Sri Lanka

మురళీ విజయ్‌, ధావన్‌, పుజారా, కోహ్లీ, రహానె, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ.. వీరంతా అప్పుడు.. ఇప్పుడు కూడా జట్టులో ఆడిన వారే.

భారత నయావాల్‌ పుజారా అప్పుడు జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేశాడు. కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 215 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది.

నాలుగేళ్ల క్రితం ఈ మైదానంలో మ్యాచ్‌ ఆడినప్పుడు ఏ డ్రస్సింగ్‌ రూమ్‌ కేటాయించారో ఇప్పుడు కూడా అదే కేటాయించారని తెలిపిన పుజారా ఆ గదిలో ఎక్కడ తనకు కూర్చోవడం ఇష్టమో తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో 150 చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇది ఎంతో ప్రత్యేకమైనది. నేను శతకం సాధించినప్పుడు సహచర ఆటగాళ్లు బాల్కనీ నుంచి ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం' అని పుజారా వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 15:15 [IST]
Other articles published on Jan 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+