Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌కి ముందు డ్రీమ్ టీమ్: ఆశ్చర్య పరిచిన బెన్ స్టోక్స్

హైదరాబాద్: ఐపీఎల్ మహా సంగ్రామం తెరలేవడానికి ఇంకా 150 నిమిషాల సమయం ఉంది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన డ్రీమ్ టీమ్‌ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ ఏడాది నిర్వహించిన వేలంలో బెన్ స్టోక్స్‌ను రూ. 14.5 కోట్లకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. తద్వారా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొదలుకానున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్ లేకుండానే బెంగళూరు బరిలో దిగనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తిగా సన్నద్ధమయ్యారు.

Ahead of IPL 2017, record-breaker Ben Stokes picks his Dream XI

బెన్ స్టోక్స్ ఎంచుకున్న డ్రీమ్ టీమ్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా, ఇంగ్లాండ్‌ నుంచి ఇద్దరు, వెస్టిండిస్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు.

బెన్ స్టోక్స్ డ్రీమ్ టీమ్‌:
1. వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా)
2. అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్)
3. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)
4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
5. సచిన్ టెండూల్కర్ (ఇండియా)
6. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండిస్)
7. ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా)
8. షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)
9. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
10. కోట్నీ ఆంబ్రోస్ (వెస్టిండిస్)
11. జిమ్మీ ఆండర్సన్ (ఇంగ్లాండ్)

Story first published: Thursday, January 18, 2018, 12:07 [IST]
Other articles published on Jan 18, 2018
Read in English: Ben Stokes picks his
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+