ఎంత కష్టం, మనసు దోచారు: చిన్నారులతో యువరాజ్
హైదరాబాద్: చిన్నతనంలోనే కేన్సర్ బారిన పడి జీవన పోరాటం చేస్తున్న కేన్సర్ బాధిత చిన్నారుల ముఖాల్లో సంతోషపు వెలుగు నింపారు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. క్రిస్టమస్ సందర్భంగా శుక్రవారం ముంబైలోని పరేల్‌లో ఉన్న సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో యువరాజ్ పాల్గొన్నాడు.

చిన్నారులతో ముచ్చటించిన యువరాజ్
ఈ సందర్భంగా కేన్సర్ బాధిత చిన్నారులతో ముచ్చటించిన యువరాజ్ వారి బాగోగులు గురించి శ్రద్ధగా అడిగి తెలుసుకున్నాడు. తన ఫ్యాషన్ లేబుల్ బ్రాండ్ వైడబ్ల్యుసీ తరుపున కేన్సర్ బాధిత చిన్నారులకు బహుమతులు అందజేశారు. సుమారు 30 మంది కేన్సర్ బాధిత చిన్నారులతో యువీ కాసేపు ముచ్చటించారు.

క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా లక్ష్యం
యువరాజ్ సింగ్ రాకతో ఆ చిన్నారులు ఆనందంతో గంతులేశారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. ‘మనం అందరం ఎంతో ఆనందంతో పండుగ జరుపుకొంటున్నాం. అయితే మనకు చేతనైనంతలో ఎంతో కొంత తోటివారికి సాయం చేయాలి. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నాకున్న అతిపెద్ద లక్ష్యం' అని యువీ చెప్పాడు.

తన మదిని దోచుకున్నారన్న యువరాజ్
సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌లోని చిన్నారులు నిజంగా తన మదిని దోచుకున్నారని యువీ తెలిపాడు. వారి పట్టుదల, సానుకూల దృక్పథం మనందరికీ ఓ ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నాడు. వారితో కొంత సమయం గడిపినందుకు కృతజ్ఞుడినని యువీ వ్యాఖ్యానించాడు.

త్వరగా కోలుకోవాలని యువరాజ్ సింగ్ ప్రార్థన
ఈ చిన్నారులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు. 2011 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత కేన్సర్ బారిన పడటంతో లండన్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications