Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ఆఫ్రిది: టీ10లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌

'Ageless' Shahid Afridi picks up hat-trick to mark the beginning of T10 era

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా తనలో ఇంకా సత్తా తగ్గలేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ నిరూపించుకున్నాడు. షార్జా వేదికగా జరుగుతున్న టీ10 క్రికెట్ లీగ్‌లో 37 ఏళ్ల వయసులో తన పదునైన బంతులతో అరుదైన ఘనత సాధించాడు.

క్రికెట్‌లో అత్యంత పొట్టి ఫార్మెట్ అయిన టీ10 టోర్నీలో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా షాహిద్ అఫ్రిదీ నిలిచాడు. గురువారం షార్జా వేదికగా ప్రారంభమైన టోర్నీలో తొలిరోజే ఈ పాక్ ఆల్ రౌండర్ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ సాధించాడు.

ఈ మూడు వికెట్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ బాధితుడిగా ఉన్నాడు. వివరాల్లోకి వెళితే టీ10 లీగ్‌లో భాగంగా గురువారం ఆఫ్రిది నేతృత్వంలోని ఫక్తూన్స్ జట్టు, సెహ్వాగ్ నేతృత్వంలోని మరాఠా అరేబియన్స్ జట్టుతో తలపడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఫక్తూన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 121 పరగులు చేసింది. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన సెహ్వాగ్ జట్టు తొలి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఓవర్ వేసిన ఫక్తూన్స్ కెప్టెన్ ఆఫ్రిది తొలి బంతికి దక్షిణాఫ్రికా ఆటగాడు రిలే రోసౌను, రెండో బంతికి వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను, మూడో బంతికి టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.

రోసౌ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, బ్రావో, సెహ్వాగ్‌లను ఎల్బీలుగా వెనుదిరిగారు. దీంతో 42/2 పటిష్టంగా ఉన్న మరాఠా అరేబియన్ జట్టు ఆఫ్రిది దెబ్బకు 42/5తో కష్టాల్లో పడింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫక్తూన్స్ జట్టు
25 పరుగుల తేడాతో సెహ్వాగ్ జట్టుపై విజయం సాధించింది.

Story first published: Friday, December 15, 2017, 15:48 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+