వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన విండీస్ క్రికెటర్!!

లండన్: వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. క్రికెట్‌కు వయసుతో సంబంధం లేదు. ఆటపై మక్కువ ఉంటే ఎంత వయస్సులో అయినా కొనసాగవచ్చు అని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్ రైట్ నిరూపించారు. రైట్ దాదాపు 85 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మరో రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో క్రికెట్‌కు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. ఇంత లేటు వయసులో ఆటకు గుడ్ బై చెప్పిన ఆటగాడు బహుశా ఇతగాడేమో!!. 85 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మొదట బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు రైట్ ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా కూడా తలపడ్డారు. అయితే 1959లో ఇంగ్లాండ్ వెళ్లి సెంట్రల్ లాంకాషైర్ తరపున ఆడారు. అనంతరం కాబోయే భార్య ఎనిడ్‌ను కలిసిన తరువాత ఇంగ్లాండ్‌లోనే స్థిరపడ్డారు. వెస్టిండీస్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, జోయెల్ గార్నర్, ఫ్రాంక్ వోరెల్‌తో కలిసి రైట్ ఆడారు.
సెసిల్ రైట్ తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశారు. ఒకానొక సమయంలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. అంటే దాదాపు 27 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియాపై యాషెస్‌లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు సిసిల్ రైట్ వయసు 49 సంవత్సరాలు అని తెలుస్తోంది. రైట్ రెండు మిలియన్లకు పైగా ఆటలలో ఆడినట్లు అంచనా. సెప్టెంబర్ 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ తరఫున స్ప్రింగ్‌హెడ్‌పై మ్యాచ్ ఆడి రైట్ వీడ్కోలు తీసుకుంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications