ఇంగ్లీష్ గడ్డపై కుల్దీప్ యాదవ్ రికార్డు: టెస్టు బెర్తు ఖాయమేనా?

హైదరాబాద్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(6/25)తో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కుల్దీప్ మ్యాజిక్‌కి తోడు రోహిత్ శర్మ సెంచరీ తొడవడంతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో 11ఓవర్‌లో బంతి అందుకున్న కుల్దీప్ యాదవ్ ఆ ఓవర్‌లో రెండో బంతికే ఓపెనర్ రాయ్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో వెంటవెంటనే బెయిర్‌స్టో(38), జో రూట్(3)లను వికెట్లు తీసి ఆతిథ్య జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
తర్వాత మరో స్పిన్నర్ చాహల్ కూడా 20ఓవర్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(19) పెవిలియన్‌కు పంపించి లయ అందుకున్నాడు. దీంతో 20ఓవర్లకే ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మళ్లీ స్టోక్స్-బట్లర్ జోడీని విడగొట్టడంలో కుల్దీప్ విజయం సాధించాడు.

11వ ఓవర్ నుంచి ఇంగ్లాండ్‌ను శాసించిన కుల్దీప్
కుల్దీప్ వేసిన 39ఓవర్ చివరి బంతిని ఆడిన బట్లర్(53) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మరోవైపు స్టోక్స్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో స్టోక్స్ వన్డేల్లో 12వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి కుల్దీప్ బౌలింగ్‌లో స్టోక్స్(50) కౌల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు
ఇలా, ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అంతేకాదు వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు.

25 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అంతేకాదు బ్రిటీష్ పిచ్‌లపై వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు.

టెస్టు జట్టులోకి కుల్దీప్ యాదవ్
ఈ ప్రదర్శనతో కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో కూడా అవకాశం లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశాడు. "నా జీవితంలో ఇది ఓ గొప్పరోజు. తొలి ఓవర్లను అద్బుతంగా ప్రారంభించాను. అదృష్టవశాత్తు తొలి రెండు ఓవర్లలోనే వికెట్లు దక్కాయి. మైదానం చిన్నదా.. పెద్దాదా అనేది నాకు పెద్దవిషయం కాదు. తొలి ఓవర్ అనంతరం బంతి బాగా తిరుగుతుందని గ్రహించా. ఈ రోజు నేను కొత్తగా ఆడాను. ఎవరైనా సరైన ప్రదేశాల్లో వైవిధ్యంగా బంతిని వేస్తే బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెడ్తారు. తదుపరి మ్యాచ్‌కు వారు మంచి సన్నాహకంతో వస్తారని నాకు తెలుసు" అని అన్నాడు.

టెస్టు జట్టులోకి కుల్దీప్ యాదవ్‌పై కోహ్లీ
తొలి వన్డే విజయానంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "టెస్టు సెలక్షన్‌లో ఏమైనా జరగొచ్చు.. సర్‌ప్రైజ్ కూడా ఉండొచ్చు. చeహల్, కుల్దీప్‌లు చాలా రాటుదేలారు. ముఖ్యంగా ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ వారి బౌలింగ్‌లో తెగ ఇబ్బంది పడుతున్నారు. టెస్టు సిరిస్‌లో వారికి చోటు దక్కే అవకాశం కూడా ఉంది" అని అన్నాడు. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న కోహ్లీసేన వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications