Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుర్‌మెహర్ ఏం తప్పు చేసింది?: నిన్న సెహ్వాగ్ నేడు యోగేశ్వర్

హైదరాబాద్: తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, ఆనాటి కార్గిల్ యుద్ధం చంపిందని ఢిల్లీ విద్యార్ధిని గుర్‌మెహర్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. గుర్‌మెహర్ చేసిన ట్వీట్‌పై సోమవారం టీమిండియా మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కాస్తంత వెటకారంగా స్పందించగా, తాజాగా ప్రముఖ రెజ్లర్ యోగశ్వర్ దత్ తనదైన శైలిలో స్పందించాడు.

బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదు, బాంబులే ఆ పని చేశాయి

ఆల్ ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదని, బాంబులే ఆ పని చేశాయని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, జర్మనీ నియంత హిట్లర్ కూడా తనను వ్యతిరేకించిన జ్యూస్‌కు చావుకు కారణం కాలేదని, అతను ప్రయోగించిన గ్యాసే ఆ పని చేసిందని ఈ మేరకు ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేసి గుర్‌మెహర్‌కు కౌంటర్ ఇచ్చాడు.

రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది నేను కాదు, అవి చేసింది నా బ్యాట్

సోమవారం నాడు వీరేంద్ర సెహ్వాగ్ తన తన టెస్టు కెరీర్‌లో చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది తాను కాదని, అవి చేసింది బ్యాట్ అని ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ జాబితాలో యోగేశ్వర్ దత్ కూడా చేరాడు. గుర్‌మెహర్‌ తీరుని తప్పబట్టిన యోగేశ్వర్, ప్లకార్డుతో ఉన్న ఆమె ఫోటోకు మరో మూడు ఫోటోల్ని జోడించి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.

నిన్న సెహ్వాగ్, నేడు యోగశ్వర్ దత్: గుర్‌మెహర్‌కు పెద్ద కౌంటర్

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్‌మెహర్ తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్టు చేశారు. అంతేకాదు కార్గిల్ యుద్ధంలో తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధం చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె తన ఫేస్ బుక్ కవర్ పిక్‌గా పెట్టుకుని వార్తల్లో నిలిచింది.

సెహ్వాగ్ ట్వీట్‌పై గుర్‌మెహర్ కౌర్‌ స్పందన

సెహ్వాగ్ ట్వీట్‌పై గుర్‌మెహర్ కౌర్‌ స్పందన

దీనిలో భాగంగా తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది. సెహ్వాగ్ ట్వీట్‌పై గుర్‌మెహర్ కౌర్‌ స్పందించింది. సోమవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో 'సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నాను. నేను పంజాబీని. సెహ్వాగ్ క్రికెట్ ఆడిన రోజుల్లో మొహాలీ స్టేడియంలో ఆయన పేరుని పలికాను. అయితే, తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ నిరాశను కలిగించింది' అని పేర్కొంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+