For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొహ్లీయే కాదు.. కోన్ స్టాస్ కూడా చిక్కుల్లో పడ్డాడు-మరో కారణంతో..!

మెల్ బోర్న్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజే సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఏ దేశంతో జరిగే టెస్టు మ్యాచ్ అయినా నోటికి పనిచెప్పడం ఆస్ట్రేలియన్లకు అలవాటు. అయితే ఇవాళ మాత్రం కంగారూలను ముందే కంగారు పెడదామని అనుకున్నాడో ఏమో.. కింగ్ కొహ్లీ తొలి అడుగు వేశాడు. ఆస్ట్రేలియా యువ సంచలనం, ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన సామ్ కోన్ స్టాస్ ను మ్యాచ్ మధ్యలో వెళ్తూ ఢీకొట్టాడు.

దీంతో కొహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. అదే సమయంలో కొహ్లీ ఢీకొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కోన్ స్టాస్ కూడా చిక్కుల్లో పడ్డాడు. అయితే ఈ ఘటనలో మాత్రం కాదు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసినా బుమ్రా, సిరాజ్ వంటి మేటి భారత బౌలర్లను ఎదుర్కొని 65 బంతుల్లోనే కోన్ స్టాస్ 60 పరుగులు బాదాడు. ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన స్పిన్నర్ జడేజా అతన్ని పెవిలియన్ కు పంపాడు.

after virat kohli Australian opener Sam Konstas also under trouble- here is why

అలా అవుటైన వెంటనే కోన్ స్టాస్ డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ అధికారిక బ్రాడ్ కాస్టర్లతో ఛాటింగ్ లో పాల్గొన్నాడు. అక్కడితో ఆగకుండా టీనేజర్ జీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంతంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు. ఇదే ఇప్పుడు కోన్ స్టాస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ ఆటగాడు లేదా మ్యాచ్ అధికారి తగిన అనుమతి లేకుండా తాము ఉండాల్సిన ప్రాంతం నుంచి బయటికి వెళ్లకూడదు. అంతేకాదు ఏదైనా మొబైల్ పరికరాలు , ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన పరికరాల్ని కూడా వాడకూడదు. వీటిని ఉల్లంఘిస్తే నిబంధనల ఉల్లంఘన కింద జరిమానా విధింపు, మ్యాచ్ లు ఆడకుండా నిషేధాలు విధించే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Story first published: Thursday, December 26, 2024, 16:16 [IST]
Other articles published on Dec 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+