'కోహ్లీ తర్వాత టీమిండియాకు ఎక్కువ కాలం ఆడేది కేఎల్ రాహులే'

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ జట్టు ఎక్కువ కాలం క్రికెట్ ఆడే సత్తా కేఎల్ రాహుల్‌కు ఉందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో వీరిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతోన్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిషేధానికి గురైన హార్ఢిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో
ఈ నేపథ్యంలో తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో క్రిస్ గేల్ మాట్లాడుతూ "ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ల గురించి మాట్లాడితే కేఎల్ రాహుల్ కచ్చితంగా నాకు గుర్తొస్తాడు. అతడు కోహ్లీ తరహాలో రాణిస్తాడని అనుకుంటున్నా" అని చెప్పాడు.

కోహ్లీ తర్వాత కేఎల్ రాహులే
"కోహ్లీ తర్వాత కేఎల్ రాహులే భారత క్రికెట్ జట్టుకు ఎక్కువ కాలం ఆడతాడు. ఈ క్రమంలో అతడిపై ఎక్కువ ఒత్తిడిని మోపొద్దు. అతడి ఆటను ఆడనివ్వాలి. ఎవరితోనూ పోటీ పెట్టొద్దు. భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. చాలామందికి జాతీయ జట్టులో చోటు దొరకడం కష్టం. రెండేళ్లుగా నేను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్నా" అని క్రిస్ గేల్ అన్నాడు.

చాలామందితో కలిసి పనిచేస్తున్నా
"పంజాబీ శైలి బాగుంది. చాలామందితో కలిసి పనిచేస్తున్నా. ఫ్రాంచైజీకి ఎంతో కొంత చేయాలని కోరుకుంటున్నా. జట్టును ప్లేఆఫ్‌కు చేర్చడం మా లక్ష్యం. అక్కడనుంచి మరింత ముందుకు తీసుకెళ్తాం. అశ్విన్‌కు జాతీయ జట్టులో ఎందుకు చోటు దొరకడం లేదో తెలియదు. అతడు చాలా మంచి బౌలర్. తనపై తనకు, జట్టుపై అతడికి అపారమైన నమ్మకం" అని గేల్ పేర్కొన్నాడు.

11 మ్యాచ్‌లాడి 450 పరుగులు చేసిన గేల్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో క్రిస్ గేల్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడి 450 పరుగులు చేశాడు. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో క్రిస్ గేల్ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఐదు వన్డేల సిరిస్‌లో క్రిస్ గేల్ ఏకంగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు. గేల్‌కి ఇది 5వ వరల్డ్‌కప్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications