For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: అన్‌సోల్డ్‌ కేన్ మామ తిరిగి వచ్చేస్తున్నాడహో.. ఇట్స్ అఫీషియల్!

Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనగానే వార్నర్ తో పాటు టక్కున గుర్తొచ్చే పేరు కేన్ విలియమ్సన్. అయితే విలియమ్సన్.. ఐపీఎల్ 2025 మెగా ఆక్ష‌న్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులంతా నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అతడు అన్ సోల్డ్‌గా మిగిలిపోయినప్పటికీ.. 18వ సీజన్ లో సందడి చేసేందుకు సిద్ధం కానున్నాడు.

ఈ సారి మరింత కొత్తగా..
అయితే ఈ సారి ఆటగాడిగా కాకుండా, కేన్ మామ మరో కొత్త అవతారమెత్తనున్నాడు. కామెంటేటర్ గా క్రికెట్ అభిమానులకు కనిపించనున్నాడు. ఈ విషయాన్ని బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ అనౌన్స్ చేసింది. తాజాగా స్టార్ స్టడెడ్ కామెంటేటరీ ప్యానెల్ ను ప్రకటించింది స్టార్ స్పోర్ట్స్. ఇందులో కేన్ విలియమ్సన్ పేరు కూడా ఉండటం విశేషం. కాగా, కేన్ విలియమ్సన్.. రెండు సార్లు ఐపీఎల్ విన్నింగ్ టీమ్ లో భాగస్వామిగా ఉన్నాడు. 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉండగా.. 2022లో ట్రోఫీని ముద్దాడిన గుజరాట్ టైటాన్స్ టీమ్ లో ఉన్నాడు.

After unsold in mega auction Kane Williamson becomes commentator in IPL 2025
Photo Credit: twitter screenshot

కేన్ మామతో పాటు ఇంకెవరు కామెంటేటరీ చేస్తున్నారంటే?
వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, సురేశ్ రైనా, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా, సునీల్ గావస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ చోప్రా, మైఖేల్ క్లార్కే, మ్యాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా.

Story first published: Friday, March 21, 2025, 18:07 [IST]
Other articles published on Mar 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+