న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ టైంలో హార్దిక్ పాండ్యా సంజూ శాంసన్ పేరు చెప్పగానే హోరెత్తిన స్టేడియం..!

After Toss While Hardik Pandya Announcing Sanju In playing 11, Fans Cheered in a Outrageous Level

మలాహిడ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ 42బంతుల్లో 77పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీపక్ హుడాతో కలిసి శాంసన్ రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చేసిన 165పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి.. 176పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అతను 2015లోనే జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు అతను టీ20ల్లో భారత్‌కు దొరికిన మరో సూపర్ ప్లేయర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ శాంసన్ కెరీర్ మాత్రం రోలర్ కాస్టర్‌లాగా పడుతూ లేస్తూ సాగింది. అతను జట్టు తరఫున ఎప్పుడూ స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు. దీంతో రెగ్యులర్ జట్టులో అతను మిస్సయ్యాడు. గత ఏడేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో కేవలం 14మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు.

ఏదేమైనప్పటికీ.. చాలా రోజుల తర్వాత మళ్లీ టీమిండియా తుది జట్టులో శాంసన్ కన్పించడం అభిమానులను ఖుషీ చేసింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులో ఉంటాడని పేర్కొనగానే.. స్టేడియం మొత్తం అరుపులు కేకలతో చీర్స్ చేసింది. హార్దిక్ పాండ్యా మాట్లాడే దాకా స్టేడియం సంజూ శాంసన్ పేరుతో మారుమ్రోగిపోయింది. దీన్ని బట్టి ప్రేక్షకులు సంజూ శాంసన్ తుది జట్టులో ఆడడం గురించి ఎంతో వెయిటింగ్ చేస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఐర్లాండ్‌లో టీమిండియా ఆడుతున్న టైంలో.. ఐర్లాండ్ ప్రేక్షకుల కంటే భారత ప్రేక్షకులే ఎక్కువగా వచ్చారు. దీంతో హార్దిక్ పాండ్యా సైతం తాము ఇండియాలో ఆడుతున్నట్లు అన్పిస్తుందని పేర్కొన్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే ఇషాన్ కిషన్‌ను కోల్పోయినా.. సంజూ శాంసన్, దీపక్ హుడాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. 42 బంతుల్లో తొమ్మిది బౌండరీలు, నాలుగు సిక్సర్లు బాది 77పరుగులు చేసి జట్టు స్కోరు రెండొందలు దాటడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక 17వ ఓవర్ రెండో బంతికి మార్క్ ఐదార్ వేసిన స్లో యార్కర్ బంతికి సంజూ ఔటయ్యాడు.

ఇకపోతే శాంసన్ అత్యుత్తమ ప్రతిభ కలిగిన బ్యాటర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన కెరీర్ తొలినాళ్లకు ఇప్పటికీ శాంసన్ ఎంతో పరిణతి చెందాడు. తనలోని ఎన్నో లోపాలను సరిదిద్దుకున్నాడు. అతను రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్ 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతను భారత జట్టులో దీర్ఘకాలిక ప్లేయర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. అవకాశం దొరికినప్పుడు వరుసగా కొన్ని మ్యాచులు అతను రాణించి తన స్థానాన్ని స్థిరపరుచుకోవాల్సిన అవసరముంది. ఇక టీ20 ప్రపంచ కప్‌ వెళ్లే జట్టులో బ్యాకప్ ఓపెనర్ కోసం టీమిండియా అన్వేషిస్తుంది. ఇందుకు నిన్నటి నాక్ ద్వారా శాంసన్ తాను కూడా బ్యాకప్ ఓపెనర్ రేసులో ఉన్నానని చాటాడు.

Story first published: Wednesday, June 29, 2022, 13:50 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X