Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరాలంటే ఇదొక్కటే పరిష్కారం!

After the second half we have had, it doesn’t feel like a bad season: Kohli

హైదరాబాద్: ఈ సీజన్ రెండో అర్ధభాగంలో మా జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో విజయంతో ఈ సీజన్‌కు ఆ జట్టు మంచి ముగింపు పలకగా... మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకునే ఈ మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బాధ్యతారహితంగా ఆడి ఓడింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు.

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ "ఈ సీజన్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైన పని. అయితే, ఈ విషయంలో గొప్పతనం మొత్తం జట్టు యాజమాన్యానిదే. ఓటములు ఎదురవుతున్నా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది" అని అన్నాడు.

అనుకున్న స్థానంలో టోర్నీని

అనుకున్న స్థానంలో టోర్నీని

"ఈ సీజన్‌లో అనుకున్న స్థానంలో టోర్నీని ముగించలేకపోయినప్పటికీ రెండో అర్ధబాగాన్ని చూస్తే మాత్రం టోర్నీలో మా ప్రదర్శన బాగానే ఉందన్న భావన కలిగింది. చివరి 7 మ్యాచుల్లో మేం 5 విజయాలు సాధించాం. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఈ విషయంలో మేం జట్టుగా గర్వపడుతున్నాం" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన సన్‌రైజర్స్

20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన సన్‌రైజర్స్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 43 బంతుల్లో 70 నాటౌట్‌( 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది.

హెట్‌ మెయిర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

హెట్‌ మెయిర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

ఆర్సీబీ జట్టులో హెట్‌ మెయిర్ 47 బంతుల్లో 75(4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్‌ 48 బంతుల్లో 65(8 ఫోర్లు, సిక్స్‌) అద్బుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించి బెంగళూరు విజయాన్నిందించారు. హెట్‌ మెయిర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

సన్ రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరాలంటే కోల్‌కతా ఓడాలి

సన్ రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరాలంటే కోల్‌కతా ఓడాలి

కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడితేనే హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్‌కతా గెలిస్తే మాత్రం హైదరాబాద్‌ టోర్నీ నుంచి ఇంటిముఖం పడుతుంది.

Story first published: Sunday, May 5, 2019, 13:44 [IST]
Other articles published on May 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+