న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తా: స్టీవ్‌ స్మిత్

IPL 2019 : Steve Smith To Leave IPL 2019 After Royal Challengers Bangalore Match || Oneindia Telugu
After the Bangalore match Ill be back, Hopefully I can contribute few more wins says Steve Smith

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం నేను జట్టుకు దూరం కావాల్సి ఉంది. అప్పటిలోపు రాజస్థాన్‌కు మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తాను అని రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ తెలిపారు. కోల్‌కతా వేదికగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పరాగ్‌ ఆకట్టుకున్నాడు:

పరాగ్‌ ఆకట్టుకున్నాడు:

మ్యాచ్ అనంతరం రాజస్థాన్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ మాట్లాడుతూ... 'సులభంగా ఛేదించాల్సిన లక్ష్యంను మేమే క్లిష్టతరం చేసుకున్నాం. మంచి ఆరంభం తర్వాత మధ్య ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే ఇందుకు కారణం. రియాన్‌ పరాగ్‌ బాగా ఆకట్టుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా పరుగులు చేసాడు. గోపాల్‌, ఆర్చర్‌లు కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారి భాగస్వామ్యమే ఎంతో ఉపయోగపడింది' అని స్మిత్ అన్నారు.

కార్తీక్ ఇన్నింగ్స్ సూపర్:

కార్తీక్ ఇన్నింగ్స్ సూపర్:

'మా బౌలర్లు మొదటి 6-7 ఓవర్లు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. కొత్త బంతితో రాణించారు. తొలి మ్యాచ్ ఆడిన థామస్‌ కూడా ఆకట్టుకున్నాడు. వరున్‌ ఆరోన్ కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేశాడు. కుర్రాళ్ళు బాగా ఆడారు. అందరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. దినేశ్‌ కార్తీక్‌ బాగా బ్యాటింగ్‌ చేశాడు, కొన్ని మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్ సూపర్' అని ప్రసంశించాడు.

ఇప్పుడే విజయాల బాట పట్టాం:

ఇప్పుడే విజయాల బాట పట్టాం:

విజయాలు సాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మొదటలో 5-6 మ్యాచ్‌లు సరిగా ఆడలేదు. ఇప్పుడే విజయాల బాట పట్టాం. ఈ సమయంలో జొఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ జట్టుకు అందుబాటులో ఉండరు. ఇది మాకు పెద్ద లోటు. ఇక బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం నేను కూడా జట్టుకు దూరం కావాల్సి ఉంది. అప్పటిలోపు రాజస్థాన్‌కు మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తాను' అని స్మిత్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, April 26, 2019, 12:07 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X