
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల వైఫల్యం అనంతరం ప్రెస్ మీట్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీమిండియా వైఫల్యం గురించి రవిశాస్త్రి కూడా ఘాటుగా బదులిస్తున్నాడు.
ఎప్పుడూ భారత క్రికెటర్ల గురించి గొప్పగా చెప్పుకునే రవిశాస్త్రి మళ్లీ అదే పంథాలో బదులిస్తున్నాడు. చేతిలో చిరుత పులి విగ్రహం పట్టుకుని రవిశాస్త్రి, పూజారా నవ్వుతూ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటో 'రనౌట్ అయిన పూజారా చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తగలడు. అని పరోక్షంగా చెప్పినట్టుగా ఉంది.' అని ప్రముఖ ఇంగ్లీషు మీడియా చెప్పుకొచ్చింది.
పూజారా వరుసగా రెండో టెస్టులోనూ రనౌట్ అవడంతో షాక్ గురైన రవిశాస్త్రి ఈ సారైనా పూజారా ఇలాంటి తప్పు చేయొద్దని సూచిస్తున్నాడు. మూడో టెస్టు జనవరి 24న జోహన్నస్‌బర్గ్‌లో జరగనుంది.
భారత బ్యాట్స్‌మెన్‌లు కేప్‌టౌన్‌లో(208), సెంచూరియోలో (287)స్కోరులను ఛేదించలేకపోయారంటూ పలు విమర్శలు వచ్చాయి. భువనేశ్వర్ కుమార్‌ని, అజింకా రహానేను తీసుకోకపోవడంపై పలువురు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.