ముంబై: టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇంటివారుగా మారుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మకు కాబోయే సతీమణి రితికా సౌజిదే ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. రితికా ఎవరో కాదు, రోహిత్ శర్మ చిన్ననాటి స్వేహితురాలు. గత ఆరు సంవత్సరాలుగా వీరిద్దరూ చనువుగా ఉంటున్నారని తెలుస్తోంది.
త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. ట్విట్టర్లో తనకు కాబోయే భార్య ఫొటోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే అభిమానులు కంగ్రాట్స్ రోహిత్ అంటూ భారీగా స్పందించారు. ఇటీవలే సురేష్ రైనా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌధరీని న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వివాహమాడిన సంగతి తెలిసిందే.