ICC WTC 2021-23 : శ్రీలంక విజయంతో ఆసీస్, ఇండియా స్థానాలకు బొక్క .. ఏ జట్టు ఏ స్థానంలో..?

ఆస్ట్రేలియాతో గాలేలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ప్లస్ 39పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో శ్రీలంక సమం చేసింది. ఇక ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా జరిగింది. ఇక డబ్ల్యూటీసీ 2021-23లో శ్రీలంక తన నాల్గవ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆస్ట్రేలియా తన మొదటి ఓటమిని ఎదుర్కొంది. దీంతో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి దెబ్బ పడింది. ఆ జట్టు ఒక స్థానం దిగజారి రెండో స్థానానికి పడిపోయింది. ఇక రెండో స్థానంలో ఇది వరకు ఉన్న దక్షిణాఫ్రికా (71.43) విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఆసీస్ (70) విన్నింగ్ పర్సంటేజీతో ద్వితీయ స్థానంలో ఉంది.

శ్రీలంక 5వ స్థానం నుంచి 3వ స్థానానికి..
ప్రస్తుతం శ్రీలంక ఏకంగా 5వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితం వల్ల భారత్‌కు బొక్క పడింది. భారత్ 3వ స్థానం నుంచి ఏకంగా అయిదో స్థానానికి పడిపోయింది. శ్రీలంక (54.17), పాకిస్థాన్ (52.38) మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇండియా (52.08)విన్నింగ్ పర్సంటేజీతో అయిదో స్థానానికి దిగజారింది. ఇక ఇంతకుముందు ఉన్నట్టే పాకిస్థాన్ నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.

మిగతా స్థానాల్లో..
ఇక డబ్ల్యూటీసీ 2021-23లో నాలుగు విజయాలతో వెస్టిండీస్ 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 16మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఇంగ్లాండ్ 7వ స్థానంలో నిలవగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో 2 విజయాలతో న్యూజిలాండ్ అట్టడుగు నుంచి రెండో స్థానంలో (8వ) స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ పది మ్యాచ్‌ల్లో ఒక విజయం, డ్రాతో అట్టడుగు స్థానంలో (9వ స్థానం) తిష్ట వేసుకుని కూర్చుంది.

తిప్పేసిన ప్రభాత్ జయసూర్య
ఇక ఆసీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 110ఓవర్లలో 364పరుగులు చేసింది. లాబుషేన్ 104పరుగుల వద్ద అవుట్ కాగా.. స్మిత్ 145పరుగులతో కడవరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 6వికెట్లు పడగొట్టి అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇక శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 181ఓవర్లలో 554పరుగులు చేసింది. ఇందులో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయగా.. దినేష్ చండిమాల్ తన తొలి డబుల్ సెంచరీ (206పరుగులు నాటౌట్) చేశాడు. దీంతో 190పరుగుల భారీ ఆధిక్యం శ్రీలంకకు దక్కింది. అయితే మరోసారి ప్రభాత్ జయసూర్య ఆరు వికెట్లతో చెలరేగడంతో (మొత్తం 12వికెట్లు) ఆస్ట్రేలియా 41ఓవర్లలో 151పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications