కెరీర్‌తో పాటు ప్రేమలో కూడా విజయం సాధించా: మయాంక అగర్వాల్

హైదరాబాద్: ఈ సీజన్ అద్భుతంగా సాగిపోయిందని.. కేవలం పరుగులే కాదు.. ప్రేమలోనూ తాను విజయం సాధించానని మయాంక్ అగర్వాల్ చెప్పాడు. ఈ సీజన్‌లో 2,141 పరుగులు చేయడంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు.
కర్ణాటకకు చెందిన మయాంక అగర్వాల్ విజయ్ హజారే టోర్నీలోనే మొత్తం 723 పరుగులు సాధించాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో వరుసగా వరుసగా 109, 84, 28, 102, 89, 140, 81, 90 పరుగుల వరద పారించాడు.
సౌరాష్ట్రతో మంగళవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక అగర్వాల్ (90: 79 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మయాంక అగర్వాల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఈ సీజన్ అద్భుతంగా సాగింది
మ్యాచ్ అనంతరం మయాంక అగర్వాల్ మాట్లాడుతూ 'ఈ సీజన్ అద్భుతంగా సాగింది. నా స్నేహితురాలికి ప్రేమ ప్రతిపాదన కూడా చేశాను ఆమె అందుకు అంగీకరించింది' అని వెల్లడించాడు. మరోవైపు, శ్రీలంకలో ముక్కోణపు టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేయకపోవడంపై మయాంక్ స్పందించేందుకు నిరాకరించాడు.

సచిన్ రికార్డు బద్దలు
2003 వరల్డ్ కప్ సందర్భంగా అంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుని కూడా మయాంక అగర్వాల్ బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 11 మ్యాచ్‌లాడి 61 యావరేజితో 673 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్
తాజాగా మయాంక అగర్వాల్ ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 723 పరుగులు నమోదు చేశాడు. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు.

ఈ సీజన్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 2,141 పరుగులు
అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో మయాంక అగర్వాల్ అన్ని ఫార్మాట్లు కలిసి 2,141 పరుగులు నమోదు చేశాడు. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications