ఒక ఏడాదిలో అత్యధిక పరుగులతో పాటు డకౌట్‌గా: కోహ్లీ ఖాతాలో ఓ రికార్డు

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చిత్రమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (82) పరుగులు చేయడంతో ఒక క్యాలెండర్ ఏడాదిలో విదేశాల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ (1137-2002) రికార్డుని బద్దలు కొట్టాడు.
ఇక, ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు డకౌట్‌గా ఏడాదిని ముగించిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 151 ఆలౌట్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌తో ఫాలోఆన్ ఆడించేందుకు నిరాకరించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన పుజారా ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్
మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఫీల్డర్ హారిస్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే పాట్ కమిన్స్ బౌలింగ్‌లోనే హారిస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ(82) పరుగులు చేయడంతో ద్రవిడ్ రికార్డుని అధిగమించాడు.

ఈ ఏడాది 1138 పరుగులు చేసిన కోహ్లీ
ఈ ఏడాది ఇప్పటి వరకు 1138 పరుగులు చేశాడు. ఒక్క ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ 593 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ, ద్రవిడ్‌లతో పాటు మొహిందర్ అమర్‌నాథ్ (1065-1983లో) కూడా విదేశాల్లో ఒకే ఏడాది 1000 పరుగుల ఘనతను సొంతం చేసుకున్నాడు. 1971లో 918 పరుగులు చేసిన గావస్కర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్ చెలరేగడంతో 32 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లను చేజార్చుకుంది. నాలుగు వికెట్లూ కమ్మిన్స్ ఖాతాలోకే చేరాయి. కమ్మిన్స్ ధాటికి హనుమ విహారి (13), పుజారా (0), కోహ్లీ (0), రహానే (1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ ప్రస్తుతం 21 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులుచేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications