పంత్ అవుట్.. లక్నో కెప్టెన్సీ రేసులో ఉన్నఐదుగురు స్టార్స్ వీరే!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ లక్నో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో జట్టు ఘోర వైఫల్యానంతరం రిషబ్ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతకుముందు 2025 సీజన్లోనూ రిషబ్ పంత్ సారథ్యంలో జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 6 మాత్రమే గెలవగలిగింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో రిషబ్ పంత్ తప్పుకోవడంతో, ఇప్పుడు లక్నో ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ జట్టులో కెప్టెన్ రేసులో ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
ఆయుష్ బదోని
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యాజమాన్యం మళ్లీ ఓ భారతీయ ఆటగాడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని భావిస్తే.. అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఆయుష్ బదోని ఒక అద్భుతమైన ఎంపిక కాగలడు. బదోని ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్‌లో 1000కి పైగా పరుగులు చేసిన నలుగురు బ్యాటర్లలో బదోని ఒకడు కావడం విశేషం.

జోష్ ఇంగ్లిస్
ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ అద్భుత ఆటతీరును చూస్తే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఫ్రాంచైజీ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది.
నికోలస్ పూరన్
వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ లక్నో సూపర్ జెయింట్స్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.నికోలస్ పూరన్ లక్నో తరఫున 57 మ్యాచ్‌ల్లో రికార్డు స్థాయిలో 1615 పరుగులు చేశాడు. పూరన్‌కు వెస్టిండీస్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా చేసిన అనుభవంతో పాటు, విదేశీ లీగ్‌లలో 'ఎమ్ఐ న్యూయార్క్' జట్టుకు నాయకత్వం వహించిన ట్రాక్ రికార్డ్ ఉంది. జట్టులో సీనియర్ ఆటగాడు కావడంతో పూరన్ కెప్టెన్సీకి సహజ సిద్ధమైన ఎంపికగా కనిపిస్తున్నాడు.
మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఈ రేసులో బలమైన పోటీదారుగా ఉన్నాడు. లక్నో ఫ్రాంచైజీ తరఫున మార్ష్ అత్యంత స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను లక్నో జట్టు కోసం 26 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1190 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2025, 2026 వరుస ఐపీఎల్ సీజన్లలో లక్నో తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతని ఫామ్, ఇంటర్నేషనల్ కెప్టెన్సీ అనుభవం జట్టుకు ఎంతగానో ప్లస్ అవుతాయి.
ఐడెన్ మార్‌క్రమ్
రిషబ్ పంత్ స్థానంలో లక్నో కెప్టెన్సీని చేపట్టే రేసులో అందరి కంటే ముందు వరుసలో దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్రమ్ ఉన్నాడు. ఐడెన్ మార్‌క్రమ్‌కు కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఉంది. మార్‌క్రమ్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా రెండుసార్లు SA20 టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే దక్షిణాఫ్రికా జట్టును టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు నడిపించాడు. గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 25 మ్యాచ్‌ల్లో 676 పరుగులు చేసిన మార్‌క్రమ్.. కెప్టెన్సీకి అత్యంత నమ్మకమైన, బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications