పల్లెకలె (శ్రీలంక) : శ్రీలంకతో జరిగిన టీ20 ద్వారా అత్యధిక పరుగుల రికార్డును తమ జట్టు ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. ముఖ్యంగా ఆస్ట్రేలియా తరుపున రెచ్చిపోయిన గ్లెన్ మాక్స్ వెల్ క్రీజులో వీర విహారం చేశాడు. ఈ క్రమంలో కేవలం 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు మాక్స్ వెల్.
ఇక చివరి మూడు ఓవర్లలో మాక్స్ వెల్ కు తక్కువగా బ్యాటింగ్ వచ్చింది కాబట్టి.. 145 వద్ద ఆగిపోయాడు కానీ లేదంటే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్(156)ను బద్దలు కొట్టేవాడు. అయితే చివరి మూడు ఓవర్లలో తక్కువగా బ్యాటింగ్ రావడానికి కారణం.. రికార్డుల కోసం కాకుండా ఆటను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు మ్యాచ్ అనంతరం మాక్స్ వెల్ వెల్లడించాడు.

17ఓవర్ల పాటు బాగా బ్యాటింగ్ చేసిన మాక్స్ వెల్.. ఆ తర్వాత ఎక్కువగా హెడ్ కు అవకాశమిచ్చాడు. 144 పరుగుల వద్ద ఉన్నప్పుడు 19 ఓవర్ చివరి బంతికి పరుగులేమి చేయకుండానే సహచరుడు హెడ్‌కు అవకాశమిచ్చాడు. ఆ తర్వాత 20వ ఓవర్ లో హెడ్ సింగిల్ తీసి మళ్లీ మాక్స్ వెల్ కు అవకాశమిచ్చినా.. సింగిల్ తో మళ్లీ హెడ్ కే స్ట్రైకింగ్ ఇచ్చాడు మాక్స్ వెల్.
ఆ సమయంలో.. సమచరుడు ట్రావిస్ హెడ్ ను పిలిచి తన రికార్డుల గురించి ఆలోచించకుండా ఆటను ఎంజాయ్ చేయాలని సూచించాడట మాక్స్. అందుకే హెడ్ మళ్లీ మళ్లీ మాక్స్ వెల్ కే అవకాశమివ్వాలని చూసిన మాక్స్ మాత్రం నాన్ స్ట్రైకింగ్ కే పరిమితమయ్యాడు. అంటే.. ఆటను ఆస్వాదిస్తూ పోతే.. రికార్డులు వాటంతట అవే వస్తాయనేది మాక్స్ వెల్ ఫాలో అవుతోన్న ఫార్ములా అన్నమాట.