Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెడ నొప్పి నుంచి కోలుకున్న కోహ్లీ: మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్

 After neck injury, Virat Kohli undergoes light training in nets at Mumbai

హైదరాబాద్: మెడ నొప్పి నుంచి కోలుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ మెడకు గాయమైంది. గాయపడిన కోహ్లీ క్రమంగా కోలుకుంటున్నాడు.

'జిమ్‌లో చాలా కష్టపడుతున్నాను. ప్రస్తుతం నా శరీరం సహకరించినంత వరకూ శ్రమిస్తున్నా' అని కోహ్లీ తెలిపాడు. తాజాగా గాయం నుంచి కోలుకోవడంతో కోహ్లీ ఇండోర్ నెట్స్‌లో సాధారణ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో బుధవారం ప్రాక్టీస్ చేశాడు.

కొన్ని గంటలు పాటు వచ్చే వారం మొత్తం ప్రాక్టీస్

కొన్ని గంటలు పాటు వచ్చే వారం మొత్తం ప్రాక్టీస్

ప్రతిరోజు ఇలా కొన్ని గంటలు పాటు వచ్చే వారం రోజుల పాటు సాధన చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మైదానంలో సాధనకు దిగుతాడు. జూన్ 15న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవుతాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కౌంటీల్లో సర్రే జట్టుతో ఒప్పందం

కౌంటీల్లో సర్రే జట్టుతో ఒప్పందం

ఐపీఎల్ ముగియగానే ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో ఆడాలని తొలుత కోహ్లీ భావించాడు. ఈ మేరకు సర్రే జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీలు ఆడే ఉద్దేశంతో జూన్ 14 నుంచి నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఆప్ఘన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ నుంచి అప్పట్లో కోహ్లీ తప్పుకున్నాడు.

మెడనొప్పి కారణంగా కౌంటీలకు కోహ్లీ దూరం

మెడనొప్పి కారణంగా కౌంటీలకు కోహ్లీ దూరం

ఐర్లాండ్‌తో టీ20లకి మాత్రం అందుబాటులో ఉంటానని సెలక్టర్లతో ఎంపిక సమయంలో చెప్పాడు. అయితే, మెడనొప్పి కారణంగా.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రస్తుతం ఫిటెనెస్‌ సాధించే పనిలో ఉన్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బౌండరీ లైన్‌కి సమీపంలో ఓ క్యాచ్‌ అందుకునేందుకు కోహ్లీ డైవ్ చేయగా అతని మెడకి గాయమైంది.

 ఫిట్‌నెస్‌ను నిరూపించుకోనున్న కోహ్లీ

ఫిట్‌నెస్‌ను నిరూపించుకోనున్న కోహ్లీ

కాగా, ప్రస్తుతం ఐర్లాండ్‌తో జూన్ 27, 29న భారత్ రెండు టీ20లు ఆడనుంది. ఈ రెండు టీ20ల మ్యాచ్‌‌ల కోసం విరాట్ కోహ్లీ తన ఫిటెనెస్‌ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Story first published: Thursday, May 31, 2018, 15:19 [IST]
Other articles published on May 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+