మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో శిక్షణ.. ధోనీ తర్వాత రాణిస్తున్న మరో టికెట్ కలెక్టర్!!

ఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలో టికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రైల్వేస్ జట్టు ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణిస్తున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హిమాన్షు అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా, అజింక్య రహానే లాంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. వీరితోపాటు మరో నలుగురు బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్:
హిమాన్షు సంగ్వాన్ ఇంతలా రాణించడానికి కారణం మాత్రం ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంగ్వాన్ ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో కొద్దికాలం శిక్షణ తీసుకున్నాడు. ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో సంగ్వాన్ మెళకువలు నేర్చుకొని రైల్వేస్ తరఫున రాణిస్తున్నాడు. తన ప్రదర్శన వెనుక మెక్‌గ్రాత్ ఉన్నాడంటూ సంగ్వాన్ గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఎక్కడ మెరుగవ్వాలో సూచించాడు:
సంగ్వాన్ మాట్లాడుతూ... 'ఎంఆర్‌ఎఫ్ శిక్షణా శిబిరానికి మార్చిలో హాజరయ్యా. అక్కడ మెక్‌గ్రాత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనను ఆదర్శంగా తీసుకున్నా.నా బౌలింగ్ వీడియోలు చూసి ఎక్కడ మెరుగవ్వాలో సూచించాడు. క్రికెట్‌లో అతనో లెజెండ్. నాకు ఒకే విషయం చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాథమిక అంశాలనే పాటించమని సూచించాడు' అని తెలిపాడు.

మెక్‌గ్రాత్ నా రోల్‌మోడల్:
'మెక్‌గ్రాత్ నేతృత్వంలో చాలా బంతులు వేశా. నేను బౌలింగ్ చేసే విధానాన్ని నోట్ చేసేవాడు. ప్రతీ సెషన్ అయిపోయాక నాలో ప్రేరణ కలిగించి సాంకేతిక అంశాలు నేర్పించేవాడు. సొంత బలానికి కట్టుబడి ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన సూచనలే రంజీ ట్రోఫీలో నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి' అని సంగ్వాన్ వివరించాడు. మెక్‌గ్రాత్ తన రోల్‌మోడల్ అని హిమాన్షు చెప్పుకొచ్చాడు.

రైల్వేస్ విజయం:
రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. ఇక రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో మరో 47 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా అంతకుముందు టికెట్ కలెక్టర్ అన్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications