For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుంబ్లే రాజీనామా: కోచ్ ఎలా ఉండాలో చెప్పిన హ‌ర్ష్ గోయెంకా

ఐపీఎల్ పదో సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యజమాని హ‌ర్ష్ గోయెంకా తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శ చేశారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యజమాని హ‌ర్ష్ గోయెంకా తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శ చేశారు.

కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు కుంబ్లే ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లేతో కోహ్లీ విభేదాలను ఆయన పరోక్షంగా ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

After MS Dhoni, Harsh Goenka Now Takes On Virat Kohli

'ఇండియన్ క్రికెట్ కోచ్ పదవికి అప్లై చేసుకోండి.
అర్హ‌త‌లు:
ప్ర‌యాణ షెడ్యూల్‌ను త‌యారు చేయ‌డం..
హోట‌ల్ రూమ్స్ చూసుకోవ‌డం...
మ‌రీ ముఖ్యంగా బీసీసీఐకి, ఇండియ‌న్ టీమ్ కెప్టెన్‌కు విధేయులుగా ఉండాలి' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై నెటిజన్లు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కోహ్లీ అహంకారం వల్లే అనిల్ కుంబ్లే రాజీనామా చేశాడని గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో కోహ్లీపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హ‌ర్ష్ గోయెంకా కూడా స్పందించారు. కుంబ్లేతో కోహ్లీకి సయోధ్య కుదిర్చేందుకు సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇక, కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారా? అని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్ పదవి రేసులో వినిపిస్తున్న మొదటి పేరు రవిశాస్త్రి. గతంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు రవిశాస్త్రికి కోహ్లీ మద్దతు ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+