ఢిల్లీ: భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ఓ డాక్యుమెంటరీ చిత్రం రూపొందనుంది. అమెరికాకు చెందిన అపెక్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది. భారత జట్టు 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్‌లు అందుకోవడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించాడు.
అనంతరం క్యాన్సర్‌తో యువరాజ్ సింగ్ పోరాడి గెలిచాడు. ఇలాంటి స్ఫూర్తినిచ్చే వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశ్యంలో భాగంగా చిత్రాన్ని నిర్మించనున్నారు. యువరాజ్ పైన చిత్రం తీయడాన్ని తాము గొప్ప అవకాశంగా భావిస్తున్నామని అపెక్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ కంపెనీ గతంలో క్రీడలకు సంబంధించిన పలు సినిమాలు నిర్మించింది. 2002లో రూకీ, 2004లో మిరాకిల్, 2006లో ఇన్విన్సిబుల్, 2010లో సెక్రటరియేట్, 2012లో బిగ్ షాట్, 2013లో జిగంతే, 2014లో మిలియన్ డాలర్ ఆర్మ్ చిత్రాన్ని నిర్మించిది.