Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్ఘాన్ టెస్టుకు కోహ్లీతో కలిపి 8 మంది భారత క్రికెటర్లు దూరం..!!

After Kohli, 8 Indian players to miss Afghanistan Test to prepare for England tour?

హైదరాబాద్: అప్ఘానిస్థాన్ జట్టు కొద్ది కాలం ముందే టెస్ట్ హోదా పొంది భారత్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ ముగిశాక.. జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ క్రమంలో సర్రే తరఫున కౌంటీల్లో ఆడేందుకు సంతకం చేసిన కోహ్లి ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని టీమిండియా కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కోహ్లితోపాటు 8 మంది భారత క్రికెటర్లు ఈ టెస్టుకు దూరం కానున్నారని తెలుస్తోంది. అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు అప్ఘాన్‌తో జరగబోయే టెస్టుకు అందుబాటులో ఉండరని సమాచారం.

ఇంగ్లాండ్‌లో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ నెగ్గాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు వీరంతా ముందుగానే బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగియగానే కోహ్లి, అశ్విన్ కౌంటీలు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. ఐపీఎల్లో చోటు దక్కించుకోలేని ఇషాంత్, పుజారా ఇప్పటికే కౌంటీల్లో ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు తగిన సమయం లభించలేదు. దీంతో టెస్ట్ సిరీస్ ఓడింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ కోసం బీసీసీఐ ముందుగా వారిని ఇంగ్లాండ్ పంపిస్తోంది. అప్ఘాన్ టెస్ట్, ఇంగ్లాండ్ టూర్, ఐర్లాండ్‌తో రెండు వన్డేల సిరీస్ కోసం భారత సెలక్టర్లు మంగళవారం మూడు జట్లను ఎంపిక చేయనున్నారు. జూన్ 21 నుంచి భారత్-ఎ జట్టు కూడా బ్రిటన్‌లో పర్యటించనుంది.

Story first published: Sunday, May 6, 2018, 12:09 [IST]
Other articles published on May 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+