
హైదరాబాద్: లక్ష్యం కోసం, కాంక్ష నెరవేర్చుకోవడం కోసం జీవితాలనే త్యాగం చేసిన వాళ్లని విని ఉంటాం. ఇప్పుడు అతన్ని చూస్తున్నాం. జనవరి 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన గొంతు, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో తెలిసిన టాప్ ఆక్షనీర్ రిచర్డ్ మ్యాడ్లీ. అందుకే బీసీసీఐ ఎంచుకుని మరీ యేటా అతన్నే వేలందారుడిగా కొనసాగిస్తోంది.
రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో మనకు ఫ్రాంచైజీల తరపు నుంచి జాన్వి మెహతా(నైట్ రైడర్స్), ప్రీతి జింతా(కింగ్స్ ఎలెవన్ పంజాబ్), ఆకాశ్ అంబానీలతో పాటు ఎక్కువగా కనిపించిన, వినిపించిన మనిషి రిచర్డ్ మ్యాడ్లీ. దశాబ్ద కాలం నుంచి క్రికెట్ లీగ్‌కు వేలందారుడిగా కొనసాగుతున్న మ్యాడ్లీ గతం అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది.
ప్రముఖ మీడియా ఛానల్ బీబీసీలో ఓ గేమ్ షోకు వేలం నిర్వహించే వ్యక్తిగా నైపుణ్యం సాధించాడు. ఆ ప్రతిభ చూసే బీసీసీఐ రిచర్డ్ మ్యాడ్లీని ఐపీఎల్ కు ఆహ్వానించింది. వచ్చే ఏడాది కూడా ఆహ్వానించనుంది. అంతేకాదు 2007 నుంచి జరుగుతున్న పది ఐపీఎల్ వేలంపాటలకు ఈయనే అన్నీ..
అయితే ఇతన్ని ట్విట్టర్ ద్వారా కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇలా బదులిచ్చాడు.
* మీరు గంటల కొద్దీ గొంతును ఒకే స్థాయిలో ఎలా పలకగలుగుతారు. అని అడిగాడు. దానికి బదులుగా ఆయన నేను ఆల్కాహాల్ తీసుకుంటాను. దాని సహాయంతోనే ఒక టెంపోను మెయింటైన్ చేస్తాను. అని పేర్కొన్నాడు.
* ఇంకో వ్యక్తి నాకూ మీలాగే ఆక్షనీర్( వేలందారు) కావాలని ఉంది. అని అడిగాడు. దానికి స్పందించిన ఆయన నేను ఆక్షనీర్ అవడానికి షార్ట్‌కట్‌లు ఏమీ వాడలేదు. గదులు ఊడ్చే స్థాయి నుంచి ఇక్కడికి వరకూ వచ్చాను. దీని కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. అని వివరించాడు.
నేను వేలం పాటను ఫ్రెండ్లీ వాతావరణంతో కొనసాగాలనుకుంటాను. నేను ఆల్కహాల్ తీసుకుుని అదుపులో ఉండగలను. ఇలాగే పది సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాను. అని బదులిచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.