జార్ఖండ్: పాకిస్తాన్ జట్టు పైన భారత్ గెలిచిన అనంతరం.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి, అరుపులు, కేకలు పెట్టారు. అయితే, వారి తీరు ధోనీ సతీమణి సాక్షి సింగ్‌కు చిరాకు తెప్పించిందని తెలుస్తోంది.
అందుకు కారణం లేకపోలేదు. ఆ సమయంలో తన కూతురు జీవా నిద్రపోతున్నందున, అభిమానుల తీరు ఆమెకు చిరాకు తెప్పించినట్లుగా తెలుస్తోంది. శనివారం నాటి మ్యాచ్‌ను సాక్షి.. రాంచీలోని ఇంట్లోనే ఉండి చూసింది.
అనంతరం అభిమానులు ఇంటి ముందు చేసిన హంగామా, కాల్చిన బాణాసంచాతో కూతురు జీవాకు నిద్రాభంగమవుతుందని ఒకింత కోపాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖతాలో పోస్ట్‌లు పెట్టింది.
అందరూ చేరి నా చిన్నారిని నిద్రలేపేలా ఉన్నారని, భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఈ మ్యాచ్ గురించి జీవాకు చెబుతానని, ఇప్పుడు చిన్నపిల్ల కదా... ఏం జరుగుతుందో పాపకు తెలీదు కదా అని ట్వీట్ చేసింది.
మ్యాచ్ గెలవగానే ఓ సాక్షి.. భారత జట్టుకు కంగ్రాట్స్ చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత అభిమానుల కోలాహలంపై మరో ట్వీట్ చేసింది. మా ఇంటి బయట అభిమానులు క్రాకర్స్ కాలుస్తున్నారని, అరుస్తున్నారని, నా కూతురు నిద్ర లేస్తుందేమోనని పేర్కొంది. తన కూతురు చిన్న పిల్ల అని, ఈ మ్యాచ్ గురించి భవిష్యత్తులో చెబుతానని, ఇప్పుడు ఆమెకు ఏం జరుగుతుందో, తన తండ్రి గురించి కూడా తెలియదని పేర్కొంది.