Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాటింగ్ కోచ్ రవిశాస్త్రిని నెమ్మదిగా సైడ్ చేస్తున్న బీసీసీఐ?

ముంబై: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌ రవిశాస్త్రిని బీసీసీఐ దూరం పెట్టనుందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. టీమిండియా మాజీ డైరెక్టర్‌గా సేవలందించిన రవిశాస్త్రి... టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంట్లే ఎంటర్ అవక ముందు వరకు హెడ్ కోచ్ పదవి రేసులో ముందున్నారు.

అయితే హెడ్ కోచ్ రేసులోకి హఠాత్తుగా అనిల్ కుంబ్లే రావడంతో రవిశాస్త్రిని అవమానకరంగా టీమిండియా హెడ్ కోచ్ నుంచి తప్పించారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు బీసీసీఐ రవిశాస్త్రిని టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు.

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై రవిశాస్త్రి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా డైరెక్టర్‌గా 18 నెలలు కష్టపడ్డానని, యువ జట్టుతో అనేక విజయాలు సాధించి పెట్టానని.. అయినా తనకు కోచ్‌ పదవి దక్కలేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ravi

'నన్ను వీడియో ఇంటర్వ్యూ చేసిన సమయంలో అక్కడ గంగూలీ లేడు. మరి అతనెందుకు అక్కడ లేడో నేను అడగలేను కదా. సచిన్‌ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్‌, సంజయ్‌ జగ్దాలె చాలా మంచి ప్రశ్నలు అడిగారు. వివిధ ఫార్మాట్లలో జట్టు బాగా ఆడటానికి ఏం చేయాలో నా ప్రణాళికలు వివరించాను. ఆ సమావేశం గొప్పగా సాగింది' అని రవిశాస్త్రి చెప్పాడు.

నిజానికి బీసీసీఐ సొమ్ముని రవిశాస్త్రి అప్పనంగా తింటున్నారనే విమర్శలు గతంలో వచ్చాయి. బ్యాటింగ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించాలని క్రికెట్ దిగ్గజాలు సూచిస్తే అయిష్టంగానే బీసీసీఐ రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

శాస్త్రి నియామకంపై బీసీసీఐ సెక్రటరీ అజయ్ సింక్రే మాట్లాడుతూ హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేని అనుకున్న తర్వాత బ్యాటింగ్ కోచ్ నియామకాన్ని ప్యానెల కమిటీ సూచించిందని తెలిపారు. ఈ సమయంలో కమిటీ కేవలం హెచ్ కోజ్ నియామకం గురించి ఆలోచించాలి తప్ప మిగతా విషయాలు గురించి కాదని గుర్తు చేశానని అన్నారు.

టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరైతే ఎంపికవుతారో అతడే తన జట్టుకు కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంచుకునే వెసులుబాటుని కల్పించాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు. హెడ్ కోచ్‌గా కుంబ్లే తీసుకోబోయే నిర్ణయాల్లో పారదర్శకత, సమర్థత ఉంటుందన్నారు.

టీమిండియా కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి 21 మంది మాత్రమే ఇంటర్యూకి ఎంపిక చేశారు. వీరిలో కేవలం పది మందికి మాత్రమే క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్యూని నిర్వహించింది.

ఈ ఇంటర్యూకు భారత మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, ప్రవీణ్‌ ఆమ్రే, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌‌లతో పాటు రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ పేసర్ టామ్ మూడీ, స్టువర్ట్ లాలు హాజరవ్వగా వీరిలో ప్రధాన కోచ్‌‌గా అనిల్ కుంబ్లేను బీసీసీఐ ఎంపకి చేసింది. హెడ్ కోచ్ రేసులో శాస్త్రి, కుంబ్లేల మధ్య గట్టి పోటీ ఎదువరవ్వగా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ కూడా కుంబ్లే వైపు మొగ్గుచూపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+