Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Joe Root Records: న్యూజిలాండ్ మీద సెంచరీతో జో రూట్ పేరిట సొంతమైన అరుదైన రికార్డులివే..!

 After getting century against Newzealand Joe Root Achieved some fabulous records

లార్డ్స్‌‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో జోరూట్ (115పరుగులు 170బంతుల్లో, 12ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మరో రోజు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ మీద 5వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి 61పరుగులు కావాల్సిన తరుణంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయాన్ని దక్కించుకుంది. ఓవర్ నైట్ స్కోరు (77)పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన జోరూట్ కడవరకు క్రీజులో ఉండి సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా జోరూట్ అరుదైన ఘనతలు సాధించాడు.

ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో 10000పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటర్ అలెస్టర్ కుక్ ఈ ఘనత సాధించాడు. అలాగే అత్యంత తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన వారిలో కుక్‌ (31ఏళ్ల 157రోజులు), రూట్(31ఏళ్ల 157రోజులు), జో రూట్ (31ఏళ్ల 157రోజులు) తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత 2వ స్థానంలో సచిన్ టెండూల్కర్ (31ఏళ్ల 362రోజులు), 3వ స్థానంలో జాక్వెస్ కల్లిస్ (33ఏళ్ల 134రోజులు), రికీ పాంటింగ్ (33ఏళ్ల 162రోజులు) ఉన్నారు.

అరంగేట్రం చేసిన తర్వాత 9ఏళ్ల 171రోజుల్లో 10000మార్క్ చేరుకున్న ప్లేయర్‌గా రూట్ నిలిచాడు. ఈ ప్రకారం అందరికంటే ముందుగా 10000పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక 10000పరుగులను జో రూట్ 118 మ్యాచ్‌లలో 218 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తద్వారా ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్ 10000పరుగుల మైలురాయి చేరుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు ఈ ఘనత అలెస్టర్ కుక్ 128మ్యాచ్‌లు 229ఇన్నింగ్స్‌లలో చేశాడు. ఇకపోతే టెస్టుల్లో 26సెంచరీలు, 53హాఫ్ సెంచరీలు చేసిన జో రూట్.. ఇంగ్లాండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు (18) చేసిన ప్లేయర్‌గా తొలిస్థానంలో ఉన్నాడు. ఇక అతని తర్వాత అలెస్టర్ కుక్ (17), ఇయాన్ బెల్ (15), కెవిన్ పీటర్సన్ (11), ఆండ్రూ స్ట్రాస్ (11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Sunday, June 5, 2022, 19:18 [IST]
Other articles published on Jun 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+