ఓలీ రాబిన్సన్ 5వికెట్ల హాల్ బ్రాడ్ 4వికెట్ల దెబ్బకు
3వ రోజు మ్యాచ్ ప్రారంభమైంది. త్రీలయన్స్ పేస్ ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 118పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ 30పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఖయా జోండో 23 పరుగులు, కేశవ్ మహరాజ్ 18పరుగులు చేసి స్కోరు వంద దాటించగలిగారు. ఓలీ రాబిన్సన్ 5వికెట్ల హాల్ సాధించగా, స్టువర్ట్ బ్రాడ్ 4వికెట్లు, అండర్సన్ ఒక వికెట్ తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని సాధించారు. తర్వాత దక్షిణాఫ్రికా సైతం బౌలింగ్లో గట్టి పటిమ కనబర్చింది. త్రీలయన్స్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 200పరుగుల మార్కును దాటకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లాండ్ తరఫున ఓలీ పోప్ (67) బ్యాట్‌తో హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా ఇంగ్లాండ్ 158పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 4, మార్కో జాన్సేన్ 5వికెట్ల హాల్ సాధించాడు.

వన్ సైడ్ మార్చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 40పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీన్ ఎల్గర్, సరెల్ ఎర్వీ మొదటి వికెట్‌కు 58పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎర్వీని ఔట్ చేసి తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోయింది. 169పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్, బ్రాడ్ తలా 3, అండర్సన్, రాబిన్సన్ తలా 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ ముందు 130పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు 108పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ వన్ సైడ్ చేశారు. 5వ రోజు ఆట ప్రారంభంలో అలెక్స్ లీస్ ఔటయినప్పటికీ ఓపెనర్ జాక్ (69పరుగులు 57బంతుల్లో నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగి మ్యాచ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఏ జట్టు ఏ స్థానంలో..
ఇక మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విషయంలో పెద్దగా మార్పులు జరగకపోనప్పటికీ.. సౌతాఫ్రికా తన విన్నింగ్ పర్సంటేజీని చాలా కోల్పోయింది. ఇంగ్లాండ్ స్థానంలో ఎలాంటి మార్పు జరగనప్పటికీ విన్నింగ్ పర్సంటేజీ మెరుగుపర్చుకుంది. ఆస్ట్రేలియా జట్టు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ (70శాతం) ఉంది. ఇక తర్వాత స్థానాల్లో వరుసగా 2.దక్షిణాఫ్రికా(60శాతం), 3.శ్రీలంక(53.33శాతం), 4.ఇండియా (52.08శాతం), 5.పాకిస్థాన్ (51.85శాతం), 6.వెస్టిండీస్ (50శాతం),7.ఇంగ్లండ్ (38.6శాతం), 8.న్యూజిలాండ్ (25.93శాతం), 9.బంగ్లాదేశ్ (13.33శాతం)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












