World Test Championship: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌లో ఓటమితో 2వ స్థానానికి సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా మళ్లీ నంబర్ 1 పొజిషన్‌కు చేరుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్‌లో సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్, 85పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా 2వ స్థానానికి పడిపోయింది. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్‌కు పాయింట్ల పట్టికలో పెద్దగా ఒరిగిందేమీ లేదు కానీ ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ కాస్త మెరుగైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక శ్రీలంక 3వ స్థానంలో కొనసాగతుండగా.. భారత్ 4వ స్థానంలో, పాకిస్థాన్ 5వ స్థానంలో ఉంది.
స్టోక్స్, ఫోక్స్ సెంచరీలతో చెలరేగడంతో
ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే దక్షిణాఫ్రికా కొంపముంచింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ తలా 3వికెట్లతో చెలరేగడంతో 151పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 415/9 స్కోరు వద్ద డిక్లేర్ ఇవ్వగలిగింది. తద్వారా 264పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మరోసారి కష్టాల్లో పడింది. కీగన్ పీటర్‌సన్ (42), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (41) మినహా మిగతావారు విఫలం కాకపోవడంతో ఆ జట్టు స్కోరు 179పరుగులకే పరిమితమైంది. ఆలీ రాబిన్సన్ 4వికెట్లు పడగొట్టగా, జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 85పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు.

ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?
ఇక ఈ ఓటమి ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ రేసులో దక్షిణాఫ్రికా ఇప్పటికీ ఫేవరేట్‌గానే ఉంది. ఇకపతే భారత్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్ టీమిండియా ఫేట్ నిర్ణయించనుంది. అంతకుముందు బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ కూడా భారత పాయింట్ల పర్సంటేజీ పెంచుకునేందుకు ఓ అవకాశం. ఇక పాయింట్ల పట్టికలో వరుసగా 1.ఆస్ట్రేలియా (70విన్నింగ్ పర్సంటేజీ), 2. సౌతాఫ్రికా (66.67), 3.శ్రీలంక (53.33), 4.ఇండియా (52.08), 5.పాకిస్థాన్ (51.85), 6.వెస్టిండీస్ (50), 7.ఇంగ్లాండ్ (35.19), 8.న్యూజిలాండ్ (25.93), 9. బంగ్లాదేశ్ (13.33) స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇండియా ఫైనల్ చేరాలంటే..
ఇకపోతే ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరడం చాలా కష్టమే. అయితే అవకాశాలు లేకపోలేదు. ఇక డబ్ల్యూటీసీ 2023లో ఇండియాకు కేవలం రెండు టెస్ట్ సిరీస్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, బంగ్లాదేశ్‌లో ఆ జట్టుతో 2టెస్టుల సిరీస్ ఉంది. ఈ ఆరు టెస్టులు గనుక గెలిస్తే ఆసీస్ కంటే బెటర్ విన్నింగ్ పర్సంటేజీతో ఇండియా ఫైనల్ చేరుకునే వీలుంటుంది. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఆడే మిగతా సిరీస్ల ఫలితాలపై కూడా ఇండియా విషయం ఆధారపడుతుంది. అలాగే స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా ఇప్పటికే 5పెనాల్టీ పాయింట్లను కోల్పోయింది. ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications