World Test Championship : టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేశాక.. జట్ల స్థానాలు..!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో చివరి టెస్ట్ కూడా గెలిచిన ఇంగ్లాండ్.. సిరీస్‌ను వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక చివరి టెస్ట్ అయిదో రోజు మొదటి సెషన్ మొత్తం వర్షార్పణం అయిపోయింది. ఇంగ్లాండ్ గెలుపునకు 113 పరుగులు కావాల్సిన తరుణంలో లంచ్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు బరిలోకి దిగారు. మళ్లీ వర్షం కారణంగా ఎలాంటి డ్రామా జరగకుండా ఆలీ పోప్ ఔటయ్యాక బరిలోకి దిగిన జానీ బెయిర్ స్టో ఎడాపెడా బౌండరీలు బాదుతూ టెస్ట్ అనే విషయాన్ని మర్చిపోయాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
మరో పక్క జో రూట్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జానీ బెయిర్ స్టోకు మద్దతు పలకడంతో అతను రెచ్చిపోయాడు. ఇక చివరి వరకు వీరిద్దరు క్రీజులో ఉన్నారు. ఇక మైఖేల్ బ్రేస్ వెల్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో సిక్సర్‌తో విజయ లాంఛనాన్ని ముగించాడు. అతను కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు మరియు మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసి విజయ దుందుభీ మోగించాడు.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్థానాల్లో పరస్పర మార్పు
ఇకపోతే ఇంగ్లాండ్ సిరీస్ విజయం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు ఏం జరగలేదు. గత రెండేళ్లుగా ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడంతో ఇంగ్లాండ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో పెద్దగా ముందుగా కదల్లేకపోయింది. అయితే ఇరు జట్ల పరస్పర స్థానాలు మారాయి. ఇంగ్లాండ్.. న్యూజిలాండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించడంతో తన ఎనిమిదో స్థానం నుంచి ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. ఆ జట్టు 52 పాయింట్లతో, విన్నింగ్ పర్సంటేజీ 28.89తో 7వ స్థానానికి చేరుకోగా.. డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ వరుసగా మూడు పరాజయాలతో 7వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయింది. ఆ జట్టు 28 పాయింట్లతో 25.83 విన్నింగ్ పర్సంటేతో 8వ స్థానంలో కొనసాగుతుం

వరుసగా మూడు స్థానాల్లో..
ఇక పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (విన్నింగ్ పర్సంటేజీ 75.00) తన స్థానాన్ని యథావిధిగా కొనసాగించింది. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా (విన్నింగ్ పర్సంటేజీ 71.43)తో కొనసాగుతుంది. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రన్నరప్ అయిన భారత్ (58.33 విన్నింగ్ పర్సంటేజీ)తో మూడో స్థానంలో కొనసాగుతుంది.

మిగతా స్థానాల్లో..
ఇకపోతే బర్మింగ్‌హామ్‌లో తిరిగి షెడ్యూల్ చేయబడిన అయిదోది, చివరిదైనా టెస్టులో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇరుజట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు గెలుపు చాలా కీలకం. ఇక మిగతా స్థానాల్లో శ్రీలంక (55.56) నాలుగో స్థానంలో.. పాకిస్థాన్ (52.38) అయిదో స్థానంలో, వెస్టిండీస్ (43.75) ఆరో స్థానంలో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ (14.81) అట్టడుగున 9వ స్థానంతో కొనసాగుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, విండీస్ మధ్య టెస్ట్ సిరీస్ నడుస్తున్నా.. ఇది పాయింట్ల పట్టికను పెద్దగా ప్రభావితం చేయదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications