ఏ ముహూర్తాన ద్రావిడ్ కోచ్ అయ్యాడో గానీ.. ఇండియాకు ఎప్పుడు, ఎవరు కెప్టెన్ అవుతారో చెప్పలేని పరిస్థితి

ఏ ముహూర్తాన రాహుల్ ద్రావిడ్ ఇండియా హెడ్ కోచ్ అయ్యాడో.. అప్పటి నుంచి టీమిండియా జట్టుకు ఎవరు ఎప్పుడు కెప్టెన్ అవుతారో ఏమాత్రం అంచనా వేయలేనట్టు పరిస్థితి తయారైంది. విశ్రాంతి అనే మంత్రం జపిస్తూ.. సీనియర్లకు రెస్టుల మీద రెస్టులు ఇవ్వడం.. ఒక్కో ఫార్మాట్లో ఒక్కో కెప్టెన్ ఉండడంతో పరిస్థితి సిరీస్‌కో కెప్టెన్ అన్నట్లు తయారైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మూడు ఫార్మాట్లకు దాదాపు అతను పక్కా అందుబాటులో ఉండేవాడు. విశ్రాంతి తీసుకున్న సందర్భాలు తక్కువే. కానీ రోహిత్ వచ్చాక పరిస్థితి తారుమారైంది.
ఒక సిరీస్ ఆడితే మరో సిరీస్ రెస్ట్.. ఐపీఎల్ ఆడితే సిరీస్ల కొద్దీ విశ్రాంతి.. సీనియర్లకు ఆట కన్నా రెస్టే ఎక్కువయింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. కరోనా వల్ల జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని కట్టబెట్టారు. తాజాగా వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు ధావన్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ల సంఖ్య 8కి చేరింది.

అసలు తరచూగా కెప్టెన్సీ మార్పులకు కారణాలేంటీ?
ఈ ఏడాది విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి టాటా చెప్పడంతో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. రోహిత్ తరచూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కోవడం, విశ్రాంతి ఇవ్వాల్సి రావడం ఒక ప్రధాన కారణం. ఇక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఇటీవల గజ్జలో గాయం కారణంగా మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం రెండో ప్రధాన కారణం. టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు ఇండియా జట్టులో ప్రస్తుతం బుమ్రా, పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ లేరు. రోహిత్, రాహుల్ మిస్సయితే టీ20లకు పంత్, వన్డేలకు ధావన్, టెస్టులకు బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి వస్తుంది. ఒకేసారి రెండు సిరీస్లను షెడ్యూల్ చేసినప్పుడు టీ20 జట్టులో పంత్ లేకపోతే హార్దిక్ పాండ్యా జట్టును లీడ్ చేయాల్సి వస్తుంది.

13 ఏళ్లలో ఏడుగురు కెప్టెన్లే..
2008 నుంచి 2021 వరకు 13 ఏళ్ల కాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఏడుగురు కెప్టెన్లు మాత్రమే కెప్టెన్సీ చేశారు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర్నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించాడు. దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. విశ్రాంతి పేరిట దూరమైన సిరీస్‌లకు అతని డిప్యూటీలు సెహ్వాగ్, గంభీర్, విరాట్ కోహ్లీలు జట్టును నడిపించారు. ఇక విరాట్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. కానీ విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి టీమిండియా పరిస్థితి పూటకో కెప్టెన్ అన్నట్లు తయారైంది.

2022లో టీమిండియాకు కెప్టెన్సీ వహించిన ప్లేయర్లు :
1. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు.
2. సౌతాఫ్రికా వన్డే సిరీస్లో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు.
3. శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో సిరీస్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
4. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
5. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
6. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ అయిదో టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
7. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీ20 వార్మప్ మ్యాచ్‌లకు దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
8. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications