Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చావ్లా రంజీ జట్టు మార్పు: కెప్టెన్‌తో గొడవే కారణమా?

హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్‌ పీయూష్ చావ్లా రంజీల్లో జట్టు మారుతున్నాడు. గత పుష్కర కాలంగా ఉత్తర్‌ప్రదేశ్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన చావ్లా ఆ జట్టు కెప్టెన్‌తో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాబోయే సీజన్‌లో గుజరాత్ తరఫున రంజీల్లో ఆడేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2005లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ని ఆరంభించిన చావ్లా 117 మ్యాచ్‌ల్లో 386 వికెట్లు తీశాడు. 2006-2012 మధ్య కాలంలో భారత్ తరుపున మూడు టెస్టులాడిన చావ్లా 7 వికెట్లు తీశాడు.

After a dozen years with UP, Piyush Chawla to join Parthiv Patel’s Gujarat

రంజీల్లో గత కొంతకాలంగా ఉత్తర్‌ప్రదేశ్ జట్టులో తనకి తగిన ప్రాధాన్యం దక్కక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్పీ సింగ్ తర్వాత ఉత్తరప్రదేశ్ జట్టుని వీడిన రెండో క్రికెటర్‌గా పీయూష్ చావ్లా నిలిచాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్పీ సింగ్ ఉత్తరప్రదేశ్ జట్టుని వీడి గుజరాత్ జట్టులో చేరాడు.

'ఉత్తర్‌ప్రదేశ్ జట్టుని వీడేందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఇప్పటికే గుజరాత్ కెప్టెన్‌ పార్ధీవ్ పటేల్‌తో నా నిర్ణయం చెప్పేశా. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో చర్చల సమయంలో నేను ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నానో కూడా వారికి చెప్పాను. గత మూడేళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్ జట్టు వరుస టైటిళ్లతో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో జట్టుని వీడి మరో జట్టుతో చేరుతుండటం నాకు బాధగానే ఉంది. కానీ.. ఈ జట్టులో సంతోషంగా ఉండేలేకున్నా' అని చావ్లా అన్నాడు.

గతేడాది రంజీ సీజన్‌లో చావ్లా ఉత్తరప్రదేశ్ తరుపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కుల్దీప్ యాదవ్ రాకతో ఉత్తర్‌ప్రదేశ్ జట్టులో చావ్లా ప్రాధాన్యం బాగా తగ్గిందని అతను జట్టును వీడేందుకు ఇది కూడా ఒక కారణమని క్రీడావిశ్లేషకులు అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+