

హైదరాబాద్: తాను నిర్వహిస్తోన్న లీగ్‌లకు వింత పద్ధతిలో ప్రచారం చేపడుతుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). ఈ క్రమంలోనే సెప్టెంబరులో బిస్కట్ ట్రోఫీ అంటూ వార్తల్లో నిలిచిన పాక్.. ఇప్పుడు ఓయ్.. హోయ్ అంటూ క్రేజీ టైటిల్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా జట్టుతో గత నెలలో తలపడిన పాక్.. బిస్కట్ ట్రోఫీ అనే టీ20 టోర్నీ కోసం బిస్కెట్ ఆకారంలో ఉన్న ట్రోఫీని తయారు చేయించింది.
ఈ క్రమంలో ఆవిష్కరణ రోజు నుంచే ఆ ట్రోఫీకి విపరీతమైన ప్రచారం లభించింది. అదే క్రమంలో పీసీబీ.. ఇప్పుడు తాజాగా ఓయ్ హోయ్ అన్న పదాలున్న ట్రోఫీని లాంచ్ చేసింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్నటెస్టు సిరీస్‌కు ఇరు జట్లు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అబుదాబి వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌తో సిరీస్ ఆరంభమైంది.
మ్యాచ్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు టోర్నీని ఆవిష్కరించారు. ట్రోఫీ మీదుగా ఓయ్.. హోయ్ అనే అక్షరాలతో పేర్చిన ట్రీఫీ ఆకర్షణగా నిలిచింది. అప్పటి బిస్కట్ ట్రోఫీని సర్ఫరాజ్ అహ్మద్, ఆరోన్ ఫించ్‌లు ఆవిష్కరించారు. ఆ ట్రోఫీ సందర్భంగా క్రికెట్ ప్రపంచమంతా నవ్వులు విసిరాయి. దాంతో నెటిజన్లతో పాటుగా ఐసీసీ కూడా ఓ చెయ్యేసింది. ఈ బిస్కట్‌కు ఓ అర్థం ఉందంటూ పేర్కొంది. ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది.
టెస్ట్ సిరీస్ విజేతకు ఈ ట్రోఫీ అందించనున్నారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ట్రోఫీ లాంచింగ్ ఫొటోను పీసీబీ తమ ట్విటర్‌లో షేర్ చేయగానే నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చారు. మీ స్పాన్సర్లకు కనీసం ట్రోఫీలు తయారు చేయడం కూడా రాదా అని ఆడుకున్నారు.