Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BGT సిరీస్ లో బుమ్రాపై చెలరేగిన హీరో - ఇప్పుడేమో తుస్సు! (వీడియో వైరల్)

రీసెంట్ గా ముగిసిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో.. క్రీజులో నృత్యం చేస్తున్నట్లు కదులుతూ భారీ షాట్లు బాదిన ఆ ప్లేయర్, తన జోరును కొనసాగించలేకపోయాడు. వికెట్ల వెనకాలకు ర్యాంప్‌ షాట్లు ఆడిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. బీజీటీ సిరిస్ లో కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లతోనే దూకుడుగా వ్యవహరించిన ఆ క్రికెటర్ తాజా మ్యాచ్ లో పేలవ ప్రదర్శన నిరాశపరిచాడు.

అతడు ఎవరంటే?
ఆ యంగ్ ప్లేయర్ మరెవరో కాదు సామ్‌ కొన్‌స్టాస్‌. ఇటీవలే ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో తన ప్రదర్శనతో పాటు కోహ్లీ, బుమ్రాతో గొడవపడి.. తన పేరు మార్మోగేలా చేశాడు. అంతర్జాతీయ అరంగేట్రంలోనే ఈ 19 ఏళ్ల కుర్రాడు తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఇటీవలి కాలంలో ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని రీతిలో ఏకంగా బుమ్రాపై ఆధిపత్యం ప్రదర్శించాడు.

After BGT 2024-25 heroics Kohli Bumrah Opponent Sam Konstas gets dismissed for just 4 off 9 balls in BBL match

అయితే ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు సామ్‌ కొన్‌స్టాస్‌. ప్రస్తుతం జరుగుతోన్న బీబీఎల్ 2025లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా హోబర్ట్ హర్రికేన్స్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ తో కలిసి బరిలోకి దిగిన అతడు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.

ఎనిమిది బంతులు ఎదుర్కొన్న సామ్ కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రిలే మెరిడిత్ షార్ట్ డెలివరీ వేయగా, దాని షాట్ బాదేందుకు ప్రయత్నించాడు సామ్. కానీ బంతి నేరుగా వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో సామ్ వికెట్ ను సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక సామ్ తో పాటు ఓపెనింగ్ చేసిన వార్నర్ కూడా వెంటనే ఔట్ అయిపోయాడు. ప్రస్తుతం సామ్‌ కొన్‌స్టాస్‌ ఔట్ అయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కాగా, బీబీఎల్ 2025 పాయింట్ల పట్టికలో సిడ్నీ థండర్ జట్టు ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉండగా, హోబర్ట్ హర్రికేన్స్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, January 10, 2025, 16:41 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+