జీవితాంతం కళ్లు జోళ్లు ఉచితంగా ఇస్తాం: స్టోక్స్ కోరికను మన్నించిన యాషెస్ స్పాన్సర్

హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన కొన్ని గంటలకే యాషెస్ స్పాన్సర్ స్పెక్సేవర్స్ ఇంగ్లాండ్ ఆఖరి బ్యాట్స్‌మన్ జాకీ లీచ్‌కు జీవితాంతం కళ్లు జోళ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు.

359 పరుగుల లక్ష్య ఛేదనలో
359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఒకానొక దశలో చేసిన పరుగులు 286/9. ఇంగ్లాండ్ అభిమాని సైతం కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని, కానీ, బెన్ స్టోక్స్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి బ్యాట్స్‌మన్ జాక్ లీచ్‌ను కాపాడుకుంటూ ఆస్ట్రేలియన్లకు షాకిచ్చాడు.

స్టోక్స్‌కు గొప్పగా సహకరించిన లీచ్
లీచ్ (17 బంతుల్లో 1 నాటౌట్) పరుగుతో స్టోక్స్‌కు గొప్పగా సహకరించాడు. ఇంగ్లాండ్ జట్టు స్కోరు 357 వద్ద జాక్ లీచ్ ఓవర్ మొదటి నుంచీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు మూడో బంతికి అతడు సింగిల్ తీయడంతో స్కోరు సమమైంది. చివరకు కమిన్స్ బౌలింగ్‌లో బౌండరీ బాదడంతో చరిత్రాత్మక విజయం ఇంగ్లాండ్ సొంతమైంది.
బెన్ స్టోక్స్ తన ట్విట్టర్‌లో
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ తన ట్విట్టర్‌లో యాషెస్ స్పాన్సర్ స్పెక్సేవర్స్‌ను ఉద్దేశించి "లీచ్‌కు జీవితకాలం కళ్ల జోళ్లు ఇవ్వరూ" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పెక్సేవర్స్ సంస్థ సైతం అంగీకరించింది. "జాక్ లీచ్‌కు జీవితాంతం ఉచితంగా కళ్ల జోళ్లు ఇచ్చేందుకు మేము అంగీకరిస్తున్నాం" అంటూ ట్వీట్ చేసింది.
కళ్లద్దాలను తుడుచుకోవడం
మ్యాచ్ సందర్భంగా జాక్ లీచ్ స్ట్రైక్ చేయడానికి ముందు చాలాసార్లు కళ్లద్దాలను తుడుచుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కళ్ల జోళ్లతో పాటు క్లీనింగ్ క్లోత్స్ కూడా ఉచితంగా ఇవ్వాలంటూ స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications