Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Test Championship : శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలిచాక.. పాయింట్ల పట్టికలో ఏ దేశం ఏ స్థానంలో..?

After Australia Defeated Srilanka In First Test How World Test Championship Table is..?

గాలేలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకను తుత్తునియలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ఆస్ట్రేలియన్లు గెలుపుతో ముగించారు. ఈ విజయం ద్వారా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌లుగా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఈ ఓటమితో శ్రీలంక మాత్రం పాయింట్ల పట్టికలో 5నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 212పరుగుల స్కోరు చేయగా.. ఆస్ట్రేలియా 321పరుగులు చేసి 109పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తదనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన శ్రీలంక కేవలం 113పరుగులు మాత్రమే చేయడంతో 5పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయసంగా ఛేదించి గెలుపొందింది. శ్రీలంక బ్యాటింగ్ పతనాన్ని నాథన్ లయన్ 4వికెట్లు, ట్రావిస్ హెడ్ 4వికెట్లతో శాసించారు.

శ్రీలంకను కోలుకొనివ్వకుండా..

శ్రీలంకను కోలుకొనివ్వకుండా..

తొలుత 37పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించిన శ్రీలంక.. తర్వాత కెప్టెన్ దిముత్ కరుణరత్నే (23) ఔటవ్వడంతో కోలుకోలేకుండా పోయింది. నాథన్ లయాన్ బరిలోకి దిగడంతో రెగ్యులర్‌గా శ్రీలంక బ్యాటర్లు హిట్టింగ్ చేయాలని చూస్తూ ఔటయ్యారు. లయాన్ 11 ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ ఏడు ఓవర్లలో 34పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆఫ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ 2.5 ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఒకే ఒక్క ఛేంజ్..

ఒకే ఒక్క ఛేంజ్..

ఈ మ్యాచ్ ముగిశాక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ పాయింట్ల పట్టికలో ఒక్క ఛేంజ్ వచ్చింది. శ్రీలంక ఒక స్థానానికి పడిపోగా.. వెస్టిండీస్ ఒక్క స్థానం ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (77.88 విన్నింగ్ పర్సంటేజీ)తో తొలి స్థానంలో ఉంది. ఇక దక్షిణాఫ్రికా (71.43 విన్నింగ్ పర్సంటేజీ)తో తన రెండో స్థానాన్ని కొనసాగిస్తుంది. రెండో టెస్ట్ కూడా గెలిస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఢోకా ఉండదు.

మూడో స్థానంలోనే ఇండియా

మూడో స్థానంలోనే ఇండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 - 23లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్ ప్రస్తుతం 77పాయింట్లతో 58.33విన్నింగ్ పర్సంటేజీతో కొనసాగుతుంది. ఇక 4వ స్థానంలో పాకిస్తాన్ (52.38), 5వ స్థానంలో వెస్టిండీస్ (50) ఉన్నాయి. ఇక టీమిండియా నేడు ఇంగ్లాండ్‌తో 5వ టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ముందడుగు వేయాలంటే భారత్‌కు ఈ టెస్టులో గెలవడం తప్పనిసరి.

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
 చివరి మూడు స్థానాల్లో ఆ జట్లు

చివరి మూడు స్థానాల్లో ఆ జట్లు

ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లు వరుసగా 7, 8, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు 15గేమ్‌లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే చేయగలిగింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతో ఇంగ్లాండ్ బలంగా పుంజుకుంది. కివీస్ తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 8వ స్థానానికి పడిపోగా.. బంగ్లాదేశ్‌ 10 మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి అట్టడుగున కొనసాగుతుంది.

Story first published: Friday, July 1, 2022, 16:22 [IST]
Other articles published on Jul 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+