For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌లో అరుదైన సన్నివేశం: ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో ఇరు జట్లు

After Ashes get over, players from England, Australia share dressing room

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ సమం చేసింది. సిరీస్ ఆద్యంతం వెనుకంజలోనే నిలిచిన ఇంగ్లండ్ ఎట్టకేలకు చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. స్టువర్ట్ బ్రాడ్ (4/62) జాక్ లీచ్ (4/49) రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.

399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

47 ఏళ్ల తర్వాత యాషెస్‌ సిరీస్‌ డ్రా కావడం ఇదే తొలిసారి. సిరీస్‌ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. గత యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌ గెలిచినందున ట్రోఫీని వారి వద్దే ఉండనుంది. ఇదిలా ఉంటే, సిరిస్ అనంతరం రెండు జట్లు ఒకే డ్రెస్సింగ్‌ రూమ్‌ని పంచుకున్నాయి.

మైదానంలో ప్రత్యర్థుల్లా తలపడిన ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రం కలివిడిగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Story first published: Monday, September 16, 2019, 19:01 [IST]
Other articles published on Sep 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+