Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శేష్ నారాయణను సస్పెండ్ చేసిన హెచ్‌సీఏ

After Apex meeting all members concluded Sesh narayana suspension

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అవినీతికి పాల్పడ్డాడంటూ హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అతనిపై సస్పెన్షన్‌‌కు గురైయ్యాడు. శేష్‌కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను అంబుడ్స్‌మన్‌కు హెచ్‌సీఏ సమర్పించింది.

హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌పై వేటు పడింది. హైదరాబాద్‌ క్రికెట్‌ జట్ల సెలెక్షన్‌ ప్రక్రియలో అక్రమాలు ఒకొక్కటిగా బయటికి వచ్చాయి. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు శేష్‌ సీటుకు ఎసరు తెచ్చిపెట్టాయి. సెలెక్షన్‌ కమిటీ నిర్ణయాల్లో కార్యదర్శి జోక్యాన్ని నిరసిస్తూ వరుసగా సీనియర్‌ సెలెక్టర్లు రాజీనామా చేశారు.

ఆటగాళ్ళ ఎంపికపై జూనియర్‌ జట్టు కోచ్‌ అసంతృప్తి వ్యక్తంజేయడంతో పాటు మరికొన్ని కారణాలు శేష్‌పై చర్యలు తీసుకునేందుకు దారితీసినట్లు సమాచారం. గత నెల 14న జరిగిన ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే శేష్‌కు నోటీసులు ఇచ్చినట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేకానంద్‌ స్పష్టంచేశారు.

బుధవారం జరిగిన ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సైతం శేష్‌పై వచ్చిన ఆరోపణలపై చర్చించింది. శేష్‌పై వచ్చిన ఆరోపణలు, వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ నర్సింహారెడ్డికి అందజేసినట్లు వివేక్‌ చెప్పారు. జస్టిస్‌ లోధా కమిటీ సూచనల ప్రకారం శేష్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు.

శేష్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదికను అంబుడ్స్‌మన్‌కు హెచ్‌సీఏ ఎపెక్స్‌ కౌన్సిల్‌కు సమర్పించింది. అంబుడ్స్‌మన్‌ ఆర్నెల్లలోపు తన అభిప్రాయాన్ని హెచ్‌సీఏ ఎపెక్స్‌ కౌన్సిల్‌కు చెప్పొచ్చు. ప్రస్తుతం శేష్‌పై సస్పెన్షన్ జారీ కావడంతో అంబుడ్స్‌మన్‌ నివేదిక వచ్చే వరకు ఎపెక్స్‌ కౌన్సిల్‌లో ఎవరో ఒకరు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించొచ్చు!

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 16:42 [IST]
Other articles published on Jan 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+