5Sixes In Over: వికెట్ తీశాక పిచ్చిపిచ్చిగా అరిచిన సౌతాఫ్రికా బౌలర్.. తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను సమం చేసుకున్న ఇంగ్లాండ్ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాను 41పరుగుల తేడాతో ఓడించి శుభారంభం చేసింది. ఇన్ ఫామ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) పరుగుల విధ్వంసానికి తోడు మొయిన్ అలీ (18బంతుల్లో 2ఫోర్లు, 6సిక్సర్లతో 52), డేవిడ్ మలాన్(23బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43) వీరవిహారానికి ఇంగ్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్లకు 234పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 193పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ బ్యాటర్లో ట్రిస్టాన్ స్టబ్స్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72), రీజా హెండ్రిక్స్ (33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57) విధ్వంసకరంగా ఆడిన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
వాళ్లను కాదని పెహులుక్వయోను తీసుకున్నందుకు..
ఇక ఈ టీ20లో సౌతాఫ్రికా బౌలర్ అండిలో పెహులుక్వయోను తుది జట్టులో ఆడించడం సౌతాఫ్రికా అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే గత కొంత కాలంగా అతని ప్రదర్శన ఏం బాలేదు. అయినా అతన్ని నమ్మి కెప్టెన్ మిల్లర్ తుదిజట్టులో చోటిచ్చాడు. పార్నెల్, నార్జ్ లాంటి మంచి బౌలర్లు ఉన్నా పెహులుక్వయోను ఆడించి మిల్లర్ పెద్ద తప్పే చేశాడు. ఎందుకంటే అతను తన బౌలింగ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4ఓవర్లలో ఏకంగా 63పరుగులు ఇచ్చాడు. ఎకానమీ 15.80గా నమోదైంది.
ఓవర్ సెలబ్రేషన్ కాస్ ఫుల్ డ్యామేజీ
ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ జోరు మీదున్న తరుణంలో తన 12వ ఓవర్ బౌలింగ్ చేసిన పెహులుక్వయో చివరి బంతికి అతన్ని కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. అతన్ని ఔట్ చేసిన అనంతరం పెహులుక్వయో వింత సెలెబ్రేషన్ చేసుకున్నాడు. వింత వింత శబ్దాలు చేస్తూ పరిగెత్తాడు. అతని సెలబ్రేషన్ ఎంజాయ్‌మెంట్‌ను మరెంతసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అతని బౌలింగ్‌ను తర్వాత ఓ ఆట ఆడుకున్నారు. ఏకంగా 5సిక్సులు బాది తుక్కురేగ్గొట్టారు. ఇక మొయిన్ అలీ సైతం 16బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
ఒకే ఓవర్లో 5సిక్సులతో పిచ్చికొట్టుడు
అతను 17వ ఓవర్లో బౌలింగ్ చేయగా.. క్రీజులో ఉన్న జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ పిచ్చికొట్టుడు కొట్టారు. తొలుత జానీ బెయిర్ స్టో వరుసగా తొలి రెండు బంతులను వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత రెండు వైడ్లు వేశాడు. మూడో బంతికి స్ట్రెయిట్ హిట్ చేయగా.. బౌండరీ వద్ద ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. మూడో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఇక 4, 5, 6 బంతుల్లో మొయిన్ అలీ హ్యాట్రిక్ సిక్సులు బాదాడు. దీంతో ఒకే ఓవర్లో 5సిక్సర్లు వచ్చాయి. అలాగే 33పరుగులు ఇంగ్లాండ్ పిండుకుంది. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా పెహులుక్వయో చెత్త రికార్డ్ నెలకొల్పాడు.
టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు, పరుగులు పిండుకున్న బ్యాటర్లు
36 పరుగులు : స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్
36 పరుగులు : ధనంజయ బౌలింగ్లో కీరన్ పొలార్డ్
34 పరుగులు : ఎస్ డ్యూబ్ బౌలింగ్లో సీఫెర్ట్, ఆర్ టేలర్
33 పరుగులు : పెహులుక్వయో బౌలింగ్లో బెయిర్ స్టో, మొయిన్ అలీ
32 పరుగులు : పార్నెల్ బౌలింగ్లో బై బటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications