Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేటి నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్..ఏడేళ్ల తర్వాత బరిలోకి!కంగారుపెడుతున్న స్టార్ పేసర్ల ఫిట్‌నెస్!

After 7 Years India Womens to play test match against England Women

బ్రిస్టల్‌: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడబోతోంది. బుధవారం నుంచి ప్రారంభం అయ్యే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మిథాలీసేన తలపడుతుంది. 2014 తర్వాత భారత్‌ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా.. ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. నాలుగు రోజులు మాత్రమే జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఈ నెల 3న ఇంగ్లండ్‌కి చేరుకున్న భారత మహిళల జట్టు.. అక్కడ క్వారంటైన్‌లో ఉండటంతో సన్నద్ధతకి పూర్తి సమయం దొరకలేదు.అయినప్పటికీ ఈరోజు ప్రారంభమయ్యే ఏకైక టెస్టులో భారత జట్టు ఫేవరెట్ అని రికార్డులు చెప్తున్నాయి.

8 మందికి మాత్రమే:

8 మందికి మాత్రమే:

భారత మహిళలు చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్‌ ఆడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆడిన వారిలో మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. భారత్‌ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా.. అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే. వన్డే, టీ20 ఫార్మాట్‌ రెగ్యులర్‌ ప్లేయర్లు ఈ ఫార్మాట్‌లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. కనీసం దేశవాళీ క్రికెట్‌లో కూడా నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో సీనియర్లే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్‌ మిథాలీ రాజ్, పేసర్‌ జులన్‌ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి.

 కంగారుపెడుతున్న పేసర్ల ఫిట్‌నెస్:

కంగారుపెడుతున్న పేసర్ల ఫిట్‌నెస్:

యువ సంచలనం షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. స్మృతి మంధానతో కలిసి ఆమె ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. టాప్‌ ఆర్డర్‌లో ఆమె చాలా ప్రభావం చూపనుంది. అలవాటు లేని పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన త్రయం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌, పూనమ్‌ రౌత్‌ రాణించడం భారత్‌కు ఎంతో అవసరం. అయితే చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడి చాలా ఏళ్లయిన నేపథ్యంలో వెటరన్‌ పేసర్లు జులన్‌ గోస్వామి, శిఖ పాండే సుదీర్ఘ స్పెల్స్‌ వేయగలుగుతారా అన్నది చూడాలి. జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌, పూనమ్‌ యాదవ్‌కు తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం.

 అనుభవజ్ఞులతో ఇంగ్లండ్:

అనుభవజ్ఞులతో ఇంగ్లండ్:

15 మంది సభ్యుల ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్‌ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్‌ హీతర్‌ నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్‌ బీమాంట్, ఆల్‌రౌండర్‌ బ్రంట్‌లకు అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్‌సోల్, కేట్‌ క్రాస్‌లతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో పాటు ఫిట్‌నెస్‌ పరంగా కూడా వీరంతా భారత్ కంటే చాలా ముందంజలో ఉన్నారు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

గత మూడు టెస్టుల్లో భారత్ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. 2014లో ఇంగ్లండ్‌తో రెండు, దక్షిణాఫ్రికాపై ఓ మ్యాచ్‌లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన మహిళల జట్టుగా రికార్డు సొంతం చేసుకుంటుంది. ఇంగ్లండ్‌ గడ్డపై 8 టెస్టులు ఆడిన భారత్‌ రెండింట గెలిచింది. ఆరు మ్యాచ్‌లను డ్రా చేసుకొని అజేయ రికార్డుతో ఉంది. కాగా ఇంగ్లిష్‌ జట్టుతో మొత్తంగా 13 టెస్టుల్లో తలపడిన భారత్‌ రెండింట గెలిచి.. ఓ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. 10 డ్రాగా ముగిశాయి.

Story first published: Wednesday, June 16, 2021, 9:47 [IST]
Other articles published on Jun 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+