Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1987 వరల్డ్ కప్: విజేతలకు 30 ఏళ్ల తర్వాత పతకాలు

హైదరాబాద్: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి వరల్డ్ కప్‌(1987)ని అందించిన జట్టు ఆటగాళ్లు సరిగ్గా ముప్పై ఏళ్ల తర్వాత అదివారం (జనవరి 22)వ తేదీన ఆ వరల్డ్ కప్‌కి సంబంధించిన పతకాలను అందుకోనున్నారు. వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత జరిగిన 1987 వన్డే వరల్డ్ కప్‌ను భారత్-పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి.

దీంతో 1987లో తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను అలెన్ బోర్డర్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. అప్పటి వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా అందుకున్నప్పటికీ, విజయంలో పాలు పంచుకున్న క్రికెటర్లకు మాత్రం ఇప్పటివరకు పతకాలు అందలేదు. 1987 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పటి కాలికట్ అయిన ఇప్పటి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది.

ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు

ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు

ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పట్లో గెలిచిన మ్యాచ్ విజేతలకు పతకాలు ఎప్పుడివ్వాలన్న విషయం వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చే దేశ క్రికెట్ బోర్డుపైనే ఆధారపడి ఉండేది.

నేరుగా ఐసీసీ జోక్యం ఉండదు

నేరుగా ఐసీసీ జోక్యం ఉండదు

ఈ మెగా టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో అప్పటి వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో భాగస్వామ్యమైన క్రికెటర్లతో పాటు కోచ్ బాబ్ సింప్సన్, టీమ్ మేనేజర్ అలెన్ క్రామ్టన్, ఫిజియోథెరపిస్ట్ ఎర్రాల్ ఆల్కాట్‌లకు ఇంతవరకు పతకాలు అందలేదు.

గతేడాది జూన్‌లో ఐసీసీ నిర్ణయం

గతేడాది జూన్‌లో ఐసీసీ నిర్ణయం

అయితే 1987 వరల్డ్ కప్ విజయంలో భాగస్వామ్యమైన అప్పటి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పతకాలను ఇవ్వాలని గతేడాది జూన్‌లో ఐసీసీ నిర్ణయించింది. దీంతో ఆదివారం సిడ్నీలో పాకిస్తాన్‌తో జరగనున్న నాలుగో వన్డే విరామ సమయంలో అప్పటి వరల్డ్ కప్ విజేతలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పతకాలను అందజేయనున్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌, ఐసీసీ డైరెక్టర్ హాజరు

క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌, ఐసీసీ డైరెక్టర్ హాజరు

ఈ కార్యక్రమానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌తో పాటు ఐసీసీ డైరెక్టర్ డేవిడ్ పీవిర్, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. 2003 ముందు వరకు కూడా వరల్డ్ కప్ టోర్నీలను ఆతిథ్య దేశాల బోర్డులే స్వయంగా నిర్వహించేవి. ఐసీసీ ఎటువంటి జోక్యం చేసుకునేది కాదు.

కెప్టెన్ అలెన్ బోర్డర్ హర్షం

అయితే ఇప్పటికైనా ఐసీసీ ముందుకు రావడంపై ఆనాటి వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ అలెన్ బోర్డర్ హర్షం వ్యక్తం చేశాడు. చాలా ఏళ్ల తరువాత తమకు ఈ తరహాలో గౌరవం అందడం ఎంతో గర్వంగా ఉందని బోర్డర్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+