Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

16 ఏళ్ల తరువాత పాకిస్థాన్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్.. షెడ్యూల్ ఇదే!!

After 16 years PCB confirms England tour of Pakistan in 2021

లండన్‌: ఒకటి కాదు.. ఐదు కాదు.. పది కూడా కాదు.. ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఇంగ్లండ్ క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ మేరకు మంగళవారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి టోమ్‌ హరిసన్‌ జట్టు పర్యటనను ఖరారు చేశారు. 2021, అక్టోబర్‌లో భారత్‌లో జరిగే టీ20 పురుషుల ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. అక్టోబర్‌ 12న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు చేరుకొని కరాచీలో 14, 15 వ తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడునుంది.

ఆ పర్యటన అనంతరం ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు అక్టోబర్‌ 16న భారత్‌కు చేరుకుంటాయని ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు తెలిపింది. గత నెల పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఇంగ్లండ్‌ జట్టును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇంగ్లండ్‌ బోర్డు పర్యటనను ఖరారు చేసింది. ఇంగ్లాండ్‌ జట్టు చివరిసారిగా 2005లో పాకిస్థాన్‌లో పర్యటించి మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడింది. ఆ తరువాత 2012, 2015లో ఇరు జట్లు యూఏఈలో తాత్కాలిక వేదికపై తలపడ్డాయి.

ఇంగ్లండ్‌ జట్టు పర్యటన ఖరారు కావడంపై పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌‌ వసీమ్‌ ఖాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. '2021 అక్టోబర్‌ నెలలో ఇంగ్లండ్‌ జట్టు రెండు టీ20లు ఆడడానికి పాకిస్తాన్ రానుంది. ఈ విషయం చెప్పడానికి గర్వపడుతున్నా. 16 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ జట్టు ఇక్కడ ఆడనుంది. 2022-23లో కూడా టెస్ట్ మరియు పరిమిత ఓవర్ల టోర్నీలు ఉంటాయి. ఆస్ట్రేలియా కూడా వస్తుందని మాకు నమ్మకం ఉంది' అని వసీమ్‌ ఖాన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

అలానే 2021లో ఇంగ్లండ్-భారత్ పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. భారత జట్టు ఇంగ్లీష్ గడ్డపై ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ ఆగష్టు 4న మొదలై.. సెప్టెంబర్ 10న ప్రాంభమయ్యే చివరి టెస్టుతో ముగియనుంది. ఐదు టెస్టులు ఐదు మైదానాల్లో జరుగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు పెద్దగా క్రికెట్‌ ఆడలేకపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు మినహా మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆలేదు. ప్రాణాంతక . కానీ 2021లో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉండబోతోంది.

Story first published: Wednesday, November 18, 2020, 17:59 [IST]
Other articles published on Nov 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+