Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

148 ఇన్నింగ్స్‌ల త‌ర్వాత అచ్చు గుద్దిన‌ట్లుగా ఒకేలా ఉన్న స‌చిన్, స్మిత్ గ‌ణాంకాలు.. నెట్టింట వైర‌ల్‌

After 148 innings Sachin Tendulkar and Steven Smith figures is Same

క్రికెట్‌లో టీమిండియా దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక ఆయ‌న రికార్డుల గురించి కూడా ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. 24 ఏళ్ల సుదీర్ఘ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్లో స‌చిన్ టెండూల్క‌ర్ ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఎన్నో మైలురాళ్ల‌ను చేరుకున్నాడు. చెరిగిపోని రికార్డుల‌ను త‌న పేరు మీద లిఖించుకున్నాడు. అయితే అలాంటి స‌చిన్ టెండూల్క‌ర్ ప‌రుగుల గ‌ణాంకాల‌తో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ స్టీవ్‌ స్మిత్ స‌మంగా నిలుస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు టెస్టు క్రికెట్లో 83 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 148 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే గ‌తంలో టెస్టు క్రికెట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ 148 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్నాక ఎలాంటి గ‌ణాంకాలు క‌ల్గి ఉన్నాడో ప్ర‌స్తుతం స్మిత్ కూడా దాదాపు అలాంటి గ‌ణాంకాల‌నే క‌ల్గి ఉండ‌డం గ‌మనార్హం. త‌న కెరీర్లో 148 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యే స‌రికి స‌చిన్ టెండూల్క‌ర్ 7869 ప‌రుగులు పూర్తి చేశాడు. సరిగ్గా అవే 148 ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ 7862 ప‌రుగులు చేశాడు. ఇద్ద‌రికి 7 ప‌రుగుల వ్య‌త్యాసం మాత్ర‌మే ఉంది. స‌గ‌టు స‌చిన్‌ది 59 ఉండ‌గా.. స్మిత్‌ది 60గా ఉంది. ఇక్క‌డ స‌గ‌టు 1 మాత్ర‌మే తేడా ఉంది.

Sachin Tendulkar's 5 Best ODI's | Oneindia Telugu

ఇక స‌చిన్ 29 సెంచ‌రీలు చేయ‌గా.. స్మిత్ 27 సెంచ‌రీలు చేశాడు. రెండు సెంచ‌రీల తేడా ఉంది. ఆ సమయానికి స‌చిన్ 31 హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా.. స్మిత్ 34 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 3 హాఫ్ సెంచ‌రీల తేడా మాత్రమే ఉంది. స‌చిన్ అత్య‌ధిక స్కోర్ 248* కాగా, స్మిత్ అత్య‌ధిక స్కోర్ 239గా ఉంది. కేవ‌లం 9 ప‌రుగుల తేడానే ఉంది. ఇలా టెస్టుల‌తో వ్య‌క్తిగ‌తంగా 148 ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యే స‌రికి స‌చిన్, స్మిత్ ఇన్నింగ్స్‌లు దాదాపు ఒకే విధంగా ఉండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఈ గ‌ణాంకాల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, March 9, 2022, 18:59 [IST]
Other articles published on Mar 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+