For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Afro-Asian Cup 2023 Playing 11: ఆసియా జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీ, బాబర్ ఆజామ్.. ఇంకా ఎవరెవరంటే..?

Afro-Asian Cup 2023 Playing 11 Prediction, Virat kohli, Rohit sharma, Babar Azam wiil feature..!

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఆఫ్రో-ఆసియా క్రికెట్‌ కప్‌ను 2023ఏడాదిలో తిరిగి పునఃప్రారంభించాలని యోచిస్తోంది. ఆసియా దేశాల్లో మేటి క్రికెటర్లు ఓ జట్టుగా, ఆఫ్రికా దేశాల్లోని మేటి క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి ఏసీసీ కప్ జరగనుంది. వివిధ కారణాల చేత 2007లో ఈ టోర్నీ నిలిచిపోయింది. ఈ టోర్నీని మళ్లీ ప్రారంభించడానికి ఏసీసీ ప్రతినిధులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇందు కోసం బీసీసీఐ, పీసీబీ తదితర క్రికెట్‌ బోర్డులతో ఏసీసీ ప్రతినిధులు సంప్రదిస్తున్నారని సమాచారం.

బీసీసీఐ ఓకే చెబితే..సన్నాహాకాలు షురూ

బీసీసీఐ ఓకే చెబితే..సన్నాహాకాలు షురూ

ఇక ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ ఈ విషయమై ఫోర్బ్స్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ అంగీకారం తెలిపితే మిగతా దేశాల బోర్డుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండవని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇండియా జట్ల బెస్ట్ ప్లేయర్లను ఈ టోర్నీలో ఆడించాలనేది తమ ప్లాన్ అని పేర్కొన్నాడు. బీసీసీఐ ఓకే చెప్పి.. ఇరు జట్ల ప్లేయర్ల లిస్టు కన్ఫామ్ అయితే మేం బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్ల కోసం మార్కెటింగ్ మొదలెడతామని పేర్కొన్నాడు. ఒకవేళ అన్ని సజావుగా జరిగితే ఆసియా ఎలెవెన్‌ తరఫున భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్ దేశాల ఆటగాళ్లు ఆడతారు, ఆఫ్రికా ఎలెవెన్‌ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే, నమీబియా తదితర దేశాల క్రికెటర్లు ఆడతారు.

2005లో కూడా జరిగింది

2005లో కూడా జరిగింది

ఇకపోతే ఆఫ్రో-ఆసియా క్రికెట్‌ కప్‌ తొలిసారి 2005లో జరిగింది. అప్పట్లో పాకిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది, ఇండియన్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంకన్ స్టార్ ఓపెనర్ సనత్‌ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇక గ్రేమ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌, జాక్వస్ కలిస్‌ తదితర ఆటగాళ్లు ఆఫ్రికా టీంలో బరిలోకి దిగారు. అప్పట్లో వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరిగింది. ఇక ఆసియా ఎలెవన్, ఆఫ్రికా ఎలెవన్ చెరో మ్యాచ్ గెలిచాయి. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

టాపార్డర్లో ఆ నలుగురు

టాపార్డర్లో ఆ నలుగురు

ఇక 2023లో మళ్లీ ఈ ఆఫ్రో-ఆసియా కప్ టోర్నీ జరిగితే ప్లేయింగ్ 11లో ఎవరుంటారో అంచనా వేస్తే.. రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్‌, విరాట్‌ కోహ్లి, బాబర్‌ ఆజమ్‌ ప్రస్తుతం పాకిస్థాన్, ఇండియా టీంలలో టాప్ బ్యాటర్లుగా పేరొందారు. వీరు ఈ టోర్నీకి అందుబాటులో ఉంటే వీరు నలుగురు ప్లేయింగ్ 11లో ఉండొచ్చు. వీరిలో రోహిత్ గానీ, ఆజమ్ కానీ కెప్టెన్‌గా వ్యవహరించొచ్చు. ఇక రిజ్వాన్ కీపర్‌గా సెటవుతాడు.

ఆల్రౌండర్లుగా వీరిలో ముగ్గురు

ఆల్రౌండర్లుగా వీరిలో ముగ్గురు

ఇకపోతే ఆల్రౌండర్ల లిస్టులో భారత్ తరఫున రాణిస్తున్నవారిలో హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా ముందు వరుసలో ఉంటారు. ఇక శ్రీలంక తరఫున ప్రస్తుత కెప్టెన్ దసున్ షనక, బంగ్లాదేశ్ తరఫున షకీబ్ అల్ హసన్ టాప్ క్లాస్ ప్లేయర్లు. వీరిలో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసుకునే వీలుంది. కచ్చితంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉండాలి కాబట్టి.. హార్దిక్ పాండ్యా, జడేజాలలో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకునే వీలుంటుంది.

బౌలర్లుగా ఆ నలుగురు

బౌలర్లుగా ఆ నలుగురు

ఇకపోతే ఆసియా దేశాల్లో టాప్ క్లాస్ బౌలర్లలో నంబర్ వన్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాకు పేరుంది. అలాగే పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదికి కూడా మంచి పేరుంది. దీంతో వీరిద్దరు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్టార్ వనిందు హసరంగా ఉండే అవకాశముంది. ఇక తుది జట్టులో ఇండియా నుంచే ఎక్కువ మంది ప్లేయర్లు ఆడతారు. ఎందుకంటే మ్యాచ్ వీక్షకులు, రేటింగ్, అత్యుత్తమ ఆటగాళ్లు, రెవెన్యూ తదితర కారకాల పరంగా చూసుకుంటే బీసీసీఐ బోర్డు మిగతా బోర్డుల కంటే ఉత్తమంగా ఉంటుంది.

ఆసియన్ ప్లేయింగ్ ఎలెవన్

ఆసియన్ ప్లేయింగ్ ఎలెవన్

రోహిత్ శర్మ, బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ, మహ్మద్ రిజ్వాన్, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్, దసున్ షనక, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, షాహీన్ షా ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Monday, June 20, 2022, 12:25 [IST]
Other articles published on Jun 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+