For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో ఫైనల్ ఆడాలని ఉంది: పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ

By Pratap
Shahid Afridi
కరాచీ: వరల్డ్‌కప్ టైటిల్ పోరులో దాయాదులు తలపడితే టోర్నమెంట్‌కే మజా వస్తుందంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది. భారత్, పాక్‌ల మధ్య ఫైనల్ జరగాలనే తాను కోరుకుంటున్నట్లు అప్రిదీ అన్నాడు. ఈవెంట్‌ను వీక్షించే కోట్లాది మంది అభిమానులు సైతం చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకై ఎంతగానో వేచిచూస్తుంటారని అఫ్రీది వ్యాఖ్యానించాడు. 'వరల్డ్‌కప్‌లో భారత్, పాక్ మధ్య ఫైనల్‌కు అవకాశముంది. ఒకవేళ అదే గనక జరిగితే మెగా ఈవెంట్‌కు మంచి ఊపు వస్తుంద'ని అఫ్రీది చెప్పుకొచ్చాడు.

ఉపఖండం వేదికగా మొత్తం 14 జట్లు పోటీపడుతున్న వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్, భారత్ రెండు వేర్వేరు గ్రూపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, పాక్ మధ్య ఫైనల్‌పోరు జరగలేదు. 1996 ఈవెంట్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్‌ఫైనల్ ముఖాముఖి పోరులో భారత్ 39 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+