For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇజాజ్ భట్‌ను కలసిన ఆఫ్రిది, పీసీబీతో కుదిరిన సయోధ్య

By Nageswara Rao
Afridi - Butt
లాహోర్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది, పీసీబీ మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. ఇస్లామాబాద్‌లో ఇరువురి మధ్య మంగళవారం సమావేశం జరిగింది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఆఫ్రిదికి ఇతర దేశాల్లో కౌంటీ మ్యాచ్‌లాడేందుకు బోర్డు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) అందిస్తుంది. దీంతో ఈ ఆల్‌రౌండర్ హాంప్‌షైర్ తరపున ఆడడమే కాకుండా శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎస్‌ఎల్‌పీఎల్)లోనూ పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.

దీనికి ప్రతిగా పీసీబీకి వ్యతిరేకంగా సింధ్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఆఫ్రిది ఉపసంహరించుకోనున్నాడు. ఆఫ్రిదితో జరిగిన సమావేశాన్ని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ ఇజాజ్ భట్ ధృవీకరించారు. అయితే పూర్తి వివరాల ను తెలిపేందుకు ఆయన నిరాకరించారు. గత నెలలో కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు ఆఫ్రిది కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడమే కాకుండా ఎన్‌వోసీని బోర్డు వెనక్కి తీసుకుంది. మరోవైపు ఈనెల 22న జరిగే పీసీబీ పాలక మండలి సమావేశంలో ఆఫ్రిది వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ అంశంపై అధికారిక అజెండా లేకపోయినా బోర్డు అధ్యక్షుడు ఇజాజ్ భట్ నుంచి సభ్యులు వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ఆఫ్రిదిపై కక్షసాధింపు ధోరణితో వెళ్లడం లేదని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడి ఆఫ్రిది క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని చెప్పారు. ఒకవేళ దేశవాళీ పోటీల్లో ఆడేందుకు బోర్డు నుంచి అనుమతి లభించకపోతే జాతీయ టి20 చాంపియన్‌షిప్‌లో కరాచీ డాల్ఫిన్స్ కెప్టెన్సీకి కూడా ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+