Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెనడాపై ఓడబోయి గెలిచిన పాకిస్తాన్, పుణ్యమంతా ఆఫ్రిదీదే

Shahid Afridi
కొలంబో: పాకిస్తాన్ జట్టుకు కెనడా గురువారం మ్యాచులో చెమటలు పట్టించింది. కెనడా బౌలింగ్ దాటికి చిత్తయిన పాకిస్తాన్ గెలవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. కెప్టెన్ సాహిద్ ఆఫ్రదీకే విజయానికి సంబంధించిన క్రెడిట్ దక్కుతుంది. ఐదు వికెట్లు తీసుకున్న ఆఫ్రిదీ కారణంగా పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో కెనడాను ఓడించింది. బైద్వాన్‌ (3/35), బాలాజీ రావు (2/50) ధాటికి పాకిస్థాన్‌ మొదట 43 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఉమర్‌ అక్మల్‌ (48; 68 బంతుల్లో 4X4, 1X6), మిస్బావుల్‌ (37; 68 బంతుల్లో 1X4)) మాత్రమే రాణించారు. కెనడా బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. అఫ్రిది ధాటికి 42.5 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. అఫ్రిదికి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. టోర్నీలో వరుసగా మూడో గెలుపుతో పాకిస్తాన్ క్వార్టర్స్‌ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది.

పాకిస్తాన్ పెట్టిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కెనడా వల్ల కాలేదు. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఐతే హన్స్‌రా (43; 75 బంతుల్లో 4X4, 1X6), సుర్కారి (27) నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో కెనడా ఓ దశలో 104/3 (33.2 ఓవర్లలో)తో పాక్‌ను కంగారుపెట్టింది. కానీ అఫ్రిది బంతితో జట్టును ఆదుకున్నాడు. కెనడా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. వరుసపెట్టి వికెట్లు పడగొట్టాడు. అఫ్రిది ధాటికి కెనడా 34 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పేసర్‌ హర్వీర్‌ బైద్వాన్‌ ధాటికి 15.3 ఓవర్లలో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒసిండె, హఫీజ్‌ను ఔట్‌ చేసి పాక్‌ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. కష్టాల్లో ఉన్న పాక్‌ను మిస్బావుల్‌, ఉమర్‌ అక్మల్‌ ఆదుకున్నారు. లెగ్‌స్పిన్నర్‌ బాలాజీ రావు సమస్యలు సృష్టిస్తున్నా పట్టుదలతో ఆడారు. 35వ ఓవర్లో స్కోరు 140. ఐతే ఇక చెలరేగుతారనుకున్న దశలో బాలాజీ రావు - మిస్బా, ఉమర్‌లను ఔట్‌ చేసి పాక్‌ను దెబ్బతీశాడు. అఫ్రిది (20), రజాక్‌ (8) పాక్‌ను నిరాశపరిచారు. వాహబ్‌, అజ్మల్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. 44 పరుగుల వ్యవధిలో పాక్‌ చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. చివరి నాలుగింటిని మూడు పరుగులకే కోల్పోయింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+