Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్టిన తేదీన ఆఫ్రిదీ డకౌట్: ట్విట్టర్‌లో వేళాకోలాలు

న్యూడిల్లీ: బాబా బూమ్ బూమ్ ఔట్ అని ఒక సందర్భంలో షాపిద్ ఆప్రిదీపై ఆయన కూతురు వ్యాఖ్యానించారు. అతని పట్టింపులేని బ్యాటింగ్ తీరుపై ఆమె ఆ వ్యాఖ్య చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచులోనే అఫ్రిదీ 37 బంతుల్లో శతకం పూర్తి చేసి విశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అతను ఓ కల్ట్ ఫిగర్ అయ్యాడు.

ఆదివారంనాడు జింబాబ్వేతో ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో అఫ్రీదీ సీన్ విలియమ్స్ వేసిన బంతికి డకౌట్ అయ్యాడు. ఆదివారం అఫ్రిదీ పుట్టినరోజు కావడం విశేషం. ప్రపంచ కప్ మ్యాచులో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఆ తర్వాతి మ్యాచులో వెస్టిండీస్‌పై 150 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను అఫ్రిదీ జింబాబ్వేతో మ్యాచులో డకౌట్ కావడం గుండె కోతకు గురి చేసింది.

అఫ్రిదీ క్రమంగా వయస్సు మీద పడుతోంది. దాంతో బ్యాటింగ్‌పై అది ప్రభావం చూపుతోంది. పైగా, అతని బ్యాటింగ్ శైలిపై అనుమానాలు కూడా ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు 23.32 మాత్రమే. వన్డే ఫార్మాట్‌లో ఐదు వేలకు పైగా మాత్రమే పరుగులు చేసి అందరికన్నా దిగువన ఉన్నాడు.

Afridi out for duck, Twitter ridicules him on his b'day

బౌలర్ నుంచి దూసుకొచ్చే ప్రతి బంతినీ ఆఫ్రిదీ బాదడానికే ప్రయత్నం చేయడమనేది అభిమానులను, జట్టు సహచరులను ఆగ్రహానికి గురి చేస్తోందని అంటున్నారు. వికెట్‌ను అనాలోచితంగా పారేసుకోవద్దని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ పదే పదే ఆఫ్రిదీకి సూచించాడు. అయినా అతని బ్యాటింగ్ శైలిలో మార్పు రాలేదు.

ఆఫ్రిదీ నిర్లక్ష్యంతో కూడిన బ్యాటింగ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహాన్ని వారు ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం చేశారు. అత్యంత చెడ్డగా ఆఫ్రిదీ ఆడాడని, ఆప్రిదీ జన్మదిన పాట పాడేందుకు కూడా జింబాబ్వేకు అవకాశం ఇవ్వలేదని ఫేక్ ఐపియల్ ప్లేయర్ పేర ఓ పోస్టు ట్విట్టర్‌లో చోటు చేసుకుంది. ఆఫ్రిదీ బర్త్ డే పార్టీ మెన్యూ అంటూ మరొకరు పదే పదే డక్ అనే పదాన్ని వాడుతూ ట్వీట్ చేశారు.

షాహిద్ ఆప్రిదీ జీవితకథకు డక్ టేల్స్ అని పేరు పెట్టవచ్చునని మరో ట్వీట్ పోస్టయింది. పోస్టు రిటైర్మెంట్ ప్లాన్ పరిష్కారమైంది, ఓపెన్ ఎ డక్ ఫామ్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. వాటన్నింటినీ పక్కన పెడితే పాకిస్తాన్ అత్యున్నత ఆటగాడిగా ఆప్రిదీ పేరు గడించాడు. ప్రపంచ కప్ పోటీల తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని ఆప్రిదీ చేసిన ప్రకటన చాలామందిని బాధపెట్టింది. అతని తర్వాత ఎవరిని చూడాలంటూ చాలా మంది అప్పుడు ట్వీట్ చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+